|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నగల యాడ్‌ హీరోయిన్లే చేయాలా ఏంటి..?

Published: 19-07-2025, 3:41 AM
నగల యాడ్‌ హీరోయిన్లే చేయాలా ఏంటి..?

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన బంగారు ఆభరణాల ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. డైలాగ్ లేకుండా, కేవలం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Key Points

1

మోహన్ లాల్ నటించిన బంగారు ఆభరణాల ప్రకటన వైరల్‌గా మారింది.

2

డైలాగ్ లేకుండా, కేవలం హావభావాలతో ఆకట్టుకున్నారు.

4

మోహన్ లాల్ నటనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మోహన్ లాల్ యాడ్ వైరల్

మలయాళ టాప్‌ హీరో మోహన్ లాల్ నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల కూడా ప్రశంసలు కురిపిస్తారు . మరోసారి తనను భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటుడిగా ఎందుకు భావిస్తున్నారో నిరూపించుకున్నారు. తాజాగా ఆయన నటించిన బంగారు ఆభరణాల ప్రకటన నెట్టింట వైరల్ ‌ అవుతుంది . సాధారణంగా బంగారు అభరణాలకు సంబంధించిన యాడ్స్ ‌ లలో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తారు . అయితే , ఈ దిగ్గజ నటుడు కనీసం ఒక్క డైలాగ్ ‌ కూడా లేకుండా ప్రేక్షకులను మెప్పించాడు . కేవలం తన నటనతోనే ఆశ్చర్యపరిచాడు. ఈ వాణిజ్య ప్రకటనలో పూర్తిగా అతని కళ్ళు, హావభావాలు మాత్రమే పలికించాడు . అదరహో అనిపించేలా మోహన్ లాల్ కనిపిస్తాడు .

డైలాగ్ లేని నటన

‘తుడరుమ్’ చిత్రంలో మోహన్ లాల్ ‌ తో కలిసి నటించిన, ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వాణిజ్య ప్రకటన 110 సెకన్ల నిడివితో ఉంది . మోహన్ లాల్ కారు దిగగానే .. సెట్ ‌ లో ఉన్న ప్రకాష్ ‌ స్వాగతం పలుకుతాడు . ‘ మేము దీనిని ఫ్యాషన్ ఫోటోగ్రఫీ శైలిలో చిత్రీకరించాము ‘ అంటూ మోడల్ శివానీని మోహనల్ ‌ లాక్ ‌ కు పరిచయం చేస్తాడు . యాడ్ ‌ కోసం ఆమె ధరించిన వజ్రాల ఆభరణాన్ని ఎవరికీ చెప్పకుండా మోహన్ లాల్ తీసుకుని తన వానిటీ వ్యాన్ ‌ లోకి తీసుకెళ్తాడు . అద్దం ముందు నిలబడి తన మెడలో వజ్రాల అభరణాన్ని ఆయన ధరిస్తాడు . ఆ సమయంలో ఆయన పలికించే హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి .

నెటిజన్ల ప్రతిస్పందన

ఇలా కేవలం మోహన్ ‌ లాల్ ‌ మాత్రమే నటించగలరని నెటిజన్లు అభినందిస్తున్నారు . నగలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలలో హీరోయిన్లే కనిపించాలా ఏంటి … ? అంటూ మరోకరు చెప్పుకొచ్చారు . ఇలా స్త్రీ హావభావాలు పలికించడం చాలా కష్టం .. కానీ , మోహన్ ‌ లాల్ ‌ చాలా సులువుగా మెప్పించారు . దటీజ్‌ మోహన్‌లాల్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆయన జాతీయ నటుడు అయ్యారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు .

మోహన్ లాల్ యాడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విధానం, నగల ప్రకటనలలో హీరోయిన్ల పాత్రపై చర్చను రేకెత్తిస్తోంది. నటుడి నటనకు ప్రశంసలు అందుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.