|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..

Published: 30-05-2025, 11:10 AM
జియోహాట్‌స్టార్‌లో ఉన్న మోహన్‌లాల్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తుడరుమ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా..

తుడరుమ్ సినిమా పెద్ద విజయం సాధించిన తర్వాత, జియో హాట్‌స్టార్ లో మోహన్ లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఎల్2: ఎంపురాన్, ఒప్పమ్ వంటి సినిమాలు కూడా ఈ ప్లాట్‌ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి.

Key Points

1

తుడరుమ్ లాంటి మరో మోహన్ లాల్ థ్రిల్లర్ మూవీస్ జియో హాట్‌స్టార్ లో చూడండి.

2

ఎల్2: ఎంపురాన్, ఒప్పమ్, నేరు వంటి సినిమాలతో మిమ్మల్ని అలరించే థ్రిల్లర్లు.

4

మోహన్ లాల్ అభిమానులకు జియో హాట్‌స్టార్ ఒక అద్భుతమైన థ్రిల్లర్ సేకరణను అందిస్తోంది.

మోహన్ లాల్ థ్రిల్లర్స్ జియో హాట్‌స్టార్ లో

తుడరుమ్.. ఈ ఏడాది పెను సంచలనం సృష్టించిన మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. మోహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్ లో తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ అయింది. ఓటీటీలో ఈ మూవీని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే జియోహాట్‌స్టార్ లో మోహన్‌లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాలేవో ఒకసారి చూద్దాం.

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా చరిత్ర సృష్టించిన ఎల్2: ఎంపురాన్ కూడా జియోహాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజైంది. మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లూసిఫర్ మూవీకి సీక్వెల్. ఆ సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించింది.

తుడరుమ్ తో పాటు ఇతర ఉత్కంఠభరిత చిత్రాలు

మోహన్‌లాల్ ఓ అంధుడిగా నటించిన ఒప్పమ్ (Oppam) మూవీ 2016లో వచ్చింది. ఇది కూడా ఓ థ్రిల్లర్ మూవీయే. తాను గతంలో జైలుకు పంపించిన ఓ దోషి నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి ఓ జడ్జి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు హత్యకు గురవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సైకో కిల్లర్ నుంచి ఆ అమ్మాయిన అంధుడైన హీరో ఎలా కాపాడతాడన్నదే ఈ ఒప్పమ్ మూవీ స్టోరీ.

నేరు 2023లో రిలీజైన కోర్ట్ రూమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ అడ్వొకేట్ గా నటించాడు. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఓ అంధురాలైన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ అతని ముఖాన్ని చేతులతో తడుముతూ అతని రూపాన్ని గుర్తుంచుకుంటుంది. తర్వాత తనకు బాగా తెలిసిన విద్యతో అచ్చూ అతని రూపంలోనే ఉన్న బొమ్మ తయారు చేస్తుంది. ఆమె తరఫున కోర్టులో వాదించే అడ్వొకేట్ కు నిందితుడిని పట్టించడానికి ఉండే ఒకే సాక్ష్యాధారం అదొక్కటే. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ.

జియో హాట్‌స్టార్ లో మోహన్ లాల్ సినిమాల సేకరణ

12th మ్యాన్ మూవీ 2022లో రిలీజైంది. 11 మంది వ్యక్తులు ఓ బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు. కానీ ఆ పార్టీ కాస్తా ఓ ఫోన్ కాల్, ఓ హత్యతో గందరగోళంగా మారుతుంది. ఈ మిస్టరీ ఛేదించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ థ్రిల్లర్ మూవీని కూడా జీతూ జోసెఫే డైరెక్ట్ చేశాడు. ఇది కూడా మంచి థ్రిల్లర్ సినిమాయే. ఐఎండీబీలో 6.8 రేటింగ్ నమోదైంది.

మాన్‌స్టర్ 2022లో వచ్చిన మూవీ. ఇందులో మోహన్‌లాల్ లక్కీ సింగ్, శివ్‌దేవ్ సుబ్రమణ్యం అనే రెండు పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మొత్తం మీద, జియో హాట్‌స్టార్ లో మోహన్ లాల్ నటించిన అనేక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. మీరు థ్రిల్లర్ ప్రేమికులైతే, ఈ సినిమాలను తప్పకుండా చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.