|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

Published: 10-10-2025, 10:17 AM
బంధాలు, త్యాగాల కలయిక ఇది, చరిత్ర క్రియేట్ చేయబోతున్నాం.. సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ డైరెక్టర్ నంద కిషోర్ కామెంట్స్

సూపర్ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియన్ మూవీ ‘వృషభ’ నవంబర్ 6న విడుదల కానుంది. డైరెక్టర్ నంద కిషోర్ సినిమా చరిత్ర సృష్టిస్తుందని, బంధాలు, త్యాగాల కలయికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత ఏక్తా కపూర్ కూడా సినిమా విజయానికి ఆశాభావం వ్యక్తం చేశారు.

Key Points

1

'వృషభ' నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

2

మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం.

4

బంధాలు, త్యాగాల నేప‌థ్యంలో బలమైన భావోద్వేగాలతో సినిమా రూపొందింది.

వృషభ విడుదల తేదీ, నంద కిషోర్ ధీమా

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కంప్లీట్ యాక్టర్ అనే పేరు కూడ ఉంది. మోహన్ లాల్ సినిమా అంటే మలయాళంతోపాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌ లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు.

ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘వృష‌భ‌’లో హీరోగా నటించారు మోహన్ లాల్ . కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్‌తోపాటు సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు.

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మ‌ల‌యాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న ‘వృష‌భ‌’ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహించారు.

బంధాలు, త్యాగాల గొప్ప కలయిక

ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ వృషభ ను న‌వంబ‌ర్ 6న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ నంద కిషోర్, నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

చిత్ర ద‌ర్శ‌కుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “నవంబర్ 6న ‘వృష‌భ‌’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని తెలియ‌జేయ‌టానికి ఎంతో ఆనందంగా ఉంది. వృష‌భ సినిమాతో ఓ చ‌రిత్ర‌ను క్రియేట్ చేయ‌బోతున్నాం” అని అన్నారు.

ఏక్తా కపూర్ ఆశలు, అంచనాలు

“బ‌ల‌మైన భావోద్వేగాల‌తో పాటు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో సినిమాను రూపొందించాం. బంధాలు, త్యాగాల క‌ల‌యిక‌గా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గొప్ప‌గా క‌నెక్ట్ అవుతుంది. ఇదొక ప్ర‌త్యేక‌మైన‌, సంక్లిష్ట‌మైన క‌థ‌. దీనికి ప్రాణం పోయ‌టానికి ఎంటైర్ టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. న‌వంబ‌ర్ 6న సినిమాను చూసే ప్రేక్ష‌కులు ఓ గొప్ప అనుభూతికి లోన‌వుతారు” అని డైరెక్టర్ నంద కిశోర్ తెలిపారు.

ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ మాట్లాడుతూ.. “ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీగా రూపొందించిన సనిమా ‘వృష‌భ‌’. ఇది నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన క‌థ‌. బ‌లమైన భావోద్వేగాలు, లార్జ‌ర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియ‌న్ సినిమాను గొప్ప‌గా ఆవిష్క‌రిస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.

మొత్తంగా, ‘వృషభ’ ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. మోహన్ లాల్ నటన, నంద కిషోర్ దర్శకత్వం, ఏక్తా కపూర్ నిర్మాణ విలువలు సినిమా విజయాన్ని నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.