|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 70 కోట్లు పెట్టి తీసినా.. మోహన్‌లాల్ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదా?

Published: 02-03-2026, 12:35 AM
షాకింగ్: 70 కోట్లు పెట్టి తీసినా.. మోహన్‌లాల్ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదా?
  • మోహన్‌లాల్ ‘వృషభ’: 70 కోట్లతో తీస్తే కనీసం టీ ఖర్చులకు కూడా రాని వసూళ్లు!
  • డిసెంబర్ 25న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
  • ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసిన ‘వృషభ’ చిత్రం.
  • శ్రీకాంత్ కొడుకు మేక రోషన్ ఈ చిత్రంలో నటించారు, కానీ ఫలితం నిరాశపరిచింది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘వృషభ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదేనా?

మోహన్‌ లాల్‌ మలయాళంలో సూపర్‌ స్టార్‌ గా రాణిస్తున్నారు. తెలుగులో చిరంజీవి, బాలయ్య ఎలాగో, అక్కడ మోహన్‌లాల్‌ అలాగ. ఆయన తక్కువ బడ్జెట్‌లో, తక్కువ సమయంలో సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ఏడాదికి మన హీరోలు ఒక్క మూవీ కూడా చేయలేని స్థితిలో ఉంటే, వాళ్లు మాత్రం ఏడాదికి ఐదారు సినిమాలు ఈజీగా చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. గతేడాది మోహన్‌ లాల్‌ ఆరు సినిమాలు చేస్తే, అందులో రెండు స్పెషల్‌ రోల్స్ ఉన్నాయి.

గతేడాది చేసిన సినిమాల్లో తెలుగులో `కన్నప్ప`లో ఆయన గెస్ట్ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. `భ భా బ`అనే మూవీలోనూ స్పెషల్‌ రోల్‌ చేశారు. అలాగే `ఎల్‌ 2 ఎంపురాన్‌`, `తుడరుమ్‌`, `హృదయపూర్వం`, `వృషభ` చిత్రాల్లో  హీరో నటించాడు. `ఎంపురాన్‌` మూవీ  పెద్ద విజయం సాధించింది. రూ.150కోట్ల రూపొందిన ఈ మూవీ సుమారు రూ.268కోట్లు వసూలు చేసింది. అలాగే `తుడరుమ్‌` దాన్ని మించింది. ఈ చిత్రం రూ.15కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.240కోట్లు రాబట్టింది. మలయాళంలో గతేడాది అత్యధిక లాభాలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. `హృదయపూర్వం` కూడా డీసెంట్‌గానే ఆడింది.

థియేటర్లలో టీ ఖర్చులు కూడా రాని వసూళ్లు!

కానీ మోహన్‌ లాల్‌ గతేడాదికి ముగింపు పలుకుతూ `వృషభ` చిత్రంలో నటించారు. దీన్ని మలయాళంతోపాటు తెలుగులోనూ రూపొందించారు. నంద కిశోర్‌ దర్శకుడు. ఇందులో మోహన్‌లాల్‌తోపాటు నేహా సక్సేనా, సమర్జిత్‌ లంకేష్‌, నయనసారిక నటించారు. దాదాపు రూ.70కోట్లతో రూపొందిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌ 25న విడుదలైంది. మోహన్‌లాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోరమైన పరాజయం చెందింది.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.3కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే నిండా మూడు కోట్లు కూడా రాలేదు. థియేట్రికల్‌గా భారీగానే రిలీజ్‌ అయినా ఒక్కో థియేటర్లో కనీనం టీ ఖర్చులు కూడా రాలేదట. వచ్చిన కలెక్షన్లు మోహన్‌ లాల్‌ ఇమేజ్‌ నేపథ్యంలో మొదటి రోజు వచ్చాయి. తెలుగులో మాత్రం ఆడియెన్స్ లేక షోస్‌ క్యాన్సిల్‌ చేశారు. సింగిల్‌ థియేటర్లో కనీసం ఖర్చులు కూడా రాలేదని టాక్‌. రీసెంట్‌ టైమ్‌లో మాత్రం మోహన్‌ లాల్‌ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిందీ మూవీ. గతేడాది మలయాళంలోనే అత్యధిక వసూళ్లు చేసిన మూవీ మోహన్‌ లాల్‌ ఖాతాలోనే ఉంటే, అత్యల్ప వసూళ్లని రాబట్టిన మూవీ కూడా ఆయనదే కావడం గమనార్హం.

తెలుగులో షోలు క్యాన్సిల్.. కారణం ఇదేనా?

ఇదిలా ఉంటే `వృషభ` చిత్రంలో హీరో శ్రీకాంత్‌ కొడుకు మేక రోషన్‌ కూడా నటించాడు. ఆయనపై కొంత భాగం షూట్‌ చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి రోషన్‌ తప్పుకున్నారు. ఆయన స్థానంలో సమర్జిత్‌ లంకేష్‌ని ఎంపిక చేశారు. ఓ రకంగా రోషన్‌ ఈ మూవీ నుంచి తప్పుకోవడం మంచిదే అని, ఫలితాన్ని బట్టి అర్థమయ్యింది. కథ, కథనం, మేకింగ్‌ ఇలా ప్రతి విషయంలోనూ లోపాలున్నాయి. ఎమోషన్స్ ఏమాత్రం కనెక్ట్ కాలేదు. సన్నివేశాలు కూడా చాలా వీక్‌గా ఉన్నాయి. లాజిక్‌ లేదు. రైటింగ్‌ పరంగా చాలా వీక్‌గా ఉంది. భారీ సెటప్‌లో మూవీ చేశారు. కానీ అవి ఎందుకు చేశారనేది క్లారిటీ లేదు. దీంతో ఈ మూవీ విషయంలో రూ.70కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.

ఇలాంటి షాకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.