|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మలయాళ చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ: దిగ్గజ నటుడు కన్నుమూత!

Published: 20-12-2025, 12:44 AM
మలయాళ చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ: దిగ్గజ నటుడు కన్నుమూత!
  • ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత శ్రీనివాస్ కన్నుమూత.
  • అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా పోరాడి మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు.
  • మాలీవుడ్‌లో 225కు పైగా చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు.
  • నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు, సినీ ప్రముఖుల నివాళులు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణ వార్తతో సినీ లోకం షాక్‌కు గురైంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రముఖ నటుడు శ్రీనివాస్ కన్నుమూత

Mollywood Industry : గత రెండు నెలలు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా అటు బాలీవుడ్లీ, మాలీవుడ్ లో కూడా ఎంతోమంది ప్రముఖ నటులు మరణించారు. ఇటీవలే నటుడు అఖిల్ విశ్వనాథ్ మరణ వార్తను ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు మరో నటుడు కన్నుమూశారు.. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆ నటుడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు.. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాస్.. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. దాదాపు 225 కు పైగా నటించిన ఈయన ఇప్పుడు లేరు.. ఈ వార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. దిగ్గజ నటుడు చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.. అలాగే పలువురు సన్నిహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు.. నేడు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది.. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు నటీనటులు హాజరుకానున్నారని సమాచారం.. దీని గురించి పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద చాయలు

నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

శ్రీనివాస్ మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.