|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైనర్ వివాహం: మోనాలిసా పెళ్లి చెల్లదా? బాబాయ్ సంచలన ఆరోపణలు! అసలేం జరిగింది?

Published: 16-03-2026, 6:35 AM
మైనర్ వివాహం: మోనాలిసా పెళ్లి చెల్లదా? బాబాయ్ సంచలన ఆరోపణలు! అసలేం జరిగింది?
  • ప్రయాగ్ రాజ్ కుంభమేళా ద్వారా మోనాలిసా వెలుగులోకి వచ్చారు.
  • ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా వివాహం లవ్ జిహాద్ అంటూ వార్తలు.
  • మోనాలిసా మైనర్ కావడంతో పెళ్లి చెల్లదని బాబాయ్ ఆరోపణ.
  • వివాదం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంల దృష్టికి.

మోనాలిసా భోంస్లే, ఫర్మాన్ ఖాన్ ల వివాహం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మోనాలిసా మైనర్ కావడంతో ఈ వివాహం చెల్లదని ఆమె బాబాయ్ ఆరోపించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోనాలిసా వివాహంపై వివాదం

Monalisa Bhosle: ప్రయాగ్ రాజ్ కుంభమేళా ద్వారా రాత్రికి రాత్రే సంచలనగా మారిన మోనాలిసా భోంస్లే గత కొద్దిరోజులుగా తన పెళ్లి విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .ఈమె వివాహం లవ్ జిహాద్ అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్ళికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. మోనాలిసా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుపుకున్నారు.

ఇలా ఈమె పెళ్లి పట్ల తన తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తన కుమార్తెకు మత్తుమందు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు అంటూ మోనాలిసా తండ్రి ఆరోపణలు చేశారు. ఈ విషయం ఏకంగా మహారాష్ట్ర సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. మోనాలిసాకు ఇష్టం లేకపోయిన బలవంతంగా ఈ వివాహం జరిగింది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసినప్పటికీ మోనాలిసా మాత్రం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఈమె తమకు రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మైనర్ అని ఆరోపణలు

కేరళ పోలీస్ స్టేషన్ లో మోనాలిసా రక్షణ కోరుతూ ఫిర్యాదు చేయడమే కాకుండా కేరళలోని ఒక ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. అయితే తాజాగా మోనాలిసా బాబాయ్ విజయ్ భోంస్లే ఈమె పెళ్లి గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం చెల్లదంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా 2009వ సంవత్సరంలో జన్మించింది. ఈ ప్రకారం ఈమె వయసు 17 సంవత్సమాత్రమే . ఇంకా మోనాలిసా మైనర్ కావడంతో ఈ పెళ్లి చెల్లదని తెలిపారు. కేవలం పాస్ పోర్ట్ లో తన వయసు పెంచి చూపించారని ఫర్మాన్ ఖాన్ తో ఆమె వివాహం చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

విలన్ పాత్రలో ఫర్మాన్ ఖాన్..

కుటుంబ సభ్యుల ఆందోళన

ఇలా మోనాలిసా మేజర్ కాకముందే పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్లి చిక్కుల్లో పడిందనే చెప్పాలి అయితే ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది . మరి తన బాబాయ్ చేస్తున్న వ్యాఖ్యలపై మోనాలిసా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మోనాలిసా తన సహా నటుడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మలయాళంలో తెరకెక్కిన నాగమ్మ అనే సినిమాలో నటించారు. ఇందులో మోనాలిసా ప్రధాన పాత్రలో నటించగా ఫర్మాన్ ఖాన్ విలన్ గా నటించారు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

చివరగా, మోనాలిసా వివాహం చట్టపరంగా నిలబడుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఆమె బాబాయ్ ఆరోపణలు నిజమైతే, ఈ వివాహం రద్దు అయ్యే అవకాశం ఉంది. దీనిపై మోనాలిసా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.