|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బేల్ ట్రీ హోటల్స్‌లో మోనాలిసా సందడి: కిచెన్ ప్రారంభించి.. స్వయంగా వంట చేసి షాకిచ్చింది!

Published: 20-12-2025, 2:44 PM
బేల్ ట్రీ హోటల్స్‌లో మోనాలిసా సందడి: కిచెన్ ప్రారంభించి.. స్వయంగా వంట చేసి షాకిచ్చింది!
  • హైదరాబాద్‌లోని బేల్ ట్రీ హోటల్స్ నూతన కిచెన్‌ను మోనాలిసా ప్రారంభించారు.
  • కిచెన్ ప్రారంభోత్సవంలో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
  • మోనాలిసా స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించి, కాఫీ తయారుచేశారు.
  • హోటల్ పేరు ‘బేల్ ట్రీ’ వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అధినేత రాజారెడ్డి వివరించారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్ నూతన కిచెన్‌ను ప్రముఖ సినీ నటి మోనాలిసా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె కేవలం ప్రారంభోత్సవం చేయడమే కాకుండా, స్వయంగా కాఫీ తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అభిమానుల కోలాహలం మధ్య ఈ ఈవెంట్ సందడిగా జరిగింది.

మోనాలిసా చేతుల మీదుగా నూతన కిచెన్ ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ‘బేల్ ట్రీ హోటల్’ తన సేవలను మరింత విస్తరిస్తూ, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ఘనంగా ప్రముఖ సినీ నటి, ‘కుంభమేళా’ ఫేమ్ మోనాలిసా శనివారం ఉదయం ప్రారంభించారు.

హోటల్ యాజమాన్యం మరియు సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి.

వంటకాలు పరిశీలించి, కాఫీ చేసిన మోనాలిసా

కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం మోనాలిసా మాట్లాడుతూ.. “బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి” అని కొనియాడారు. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్ లో కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు అక్కడ చేయబోయే వంటకాల గురించి మాట్లాడుతూ షెఫ్‌ల నైపుణ్యాన్ని అభినందించారు.

ఈ సందర్బంగా.. బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి హోటల్స్ పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, పరమశివునిపై తనకున్న భక్తి గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.

బేల్ ట్రీ పేరు వెనుక ఆధ్యాత్మిక నేపథ్యం

“మేము మా హోటల్‌కు ‘బేల్ ట్రీ’ (Bael Tree) అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం శివుడు. బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ‘త్రిదళం త్రిగుణాకారం’ అంటూ మనం పూజించే ఆ బిల్వ దళాల చెట్టు పేరునే మా సంస్థకు పెట్టుకోవడం మాకు గర్వకారణం. శివుడు అన్నదాత కూడా. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆ విశ్వేశ్వరుడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము. మా హోటల్స్ కు వచ్చే ప్రతి కస్టమర్‌కు మేము అందించే భోజనం ఒక ప్రసాదం లాంటిదని, అది వారికి పూర్తి తృప్తిని ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఆ తృప్తిని ఇచ్చే శక్తి ఆ భోలేనాథుడిదే అని నేను నమ్ముతాను. వ్యాపార పరంగా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న బిల్వ వృక్షం పేరును ఎంచుకోవడం వెనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ పేరు విన్నప్పుడల్లా ఆ శివయ్య గుర్తుకు వస్తారు. హోటల్‌కు వచ్చే వారికి కూడా ఆ ప్రశాంతత, పవిత్రత అందాలనేది మా సంకల్పం. ఏ పని మొదలుపెట్టినా ఆ మహాశివుడి అనుమతి, ఆశీస్సులు ఉండాలి. అందుకే ఈ రోజు ఈ కిచెన్ విభాగాన్ని ప్రారంభించే సమయంలో కూడా మేము ఆయన్నే స్మరించుకున్నాము. శివుడికి ప్రియమైన ఈ ‘బేల్ ట్రీ’ పేరుతో మేము అందిస్తున్న ఈ సేవలు అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని చెప్పారు.

మోనాలిసా రాకతో బేల్ ట్రీ హోటల్స్ కిచెన్ ప్రారంభోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోటల్ యాజమాన్యం తమకు భోలేనాథుడి ఆశీస్సులు ఉన్నాయని, కస్టమర్‌లకు ప్రసాదం లాంటి ఆహారం అందిస్తామని స్పష్టం చేసింది. ఇది హోటల్ ప్రత్యేకతను చాటింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.