
కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉత్కర్ష్ సింగ్ తో కలిసి ఆమె నటించిన పాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెపై విభిన్నంగా స్పందిస్తున్నారు.
Key Points
కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా మళ్ళీ సోషల్ మీడియాలో!
ఉత్కర్ష్ సింగ్ తో కలిసి పాటలో నటిస్తున్న మోనాలిసా.
మోనాలిసా వీడియో 2.7 మిలియన్ వ్యూస్ సాధించింది.
నెటిజన్ల నుండి మోనాలిసాపై విభిన్న అభిప్రాయాలు.
మోనాలిసా తాజా వీడియో వైరల్
2025 మహా కుంభమేళా (Maha Kumbhmela)లో సంచలనంగా మారిన “వైరల్ గర్ల్” మోనాలిసా (Viral Girl Monalisa) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరిగిన కుంభమేళా సందర్భంగా మోనాలిసా సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి షూటింగ్ దశకు ఇంకా చేరుకోలేదు. కానీ.. ఉత్కర్ష్ సింగ్ (Utkarsh Singh)తో మోనాలిసా ఒక సాంగ్ లో నటిస్తోంది. ఆ పాట గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ చాలా బాగా జరిగిందని చెప్పుకొచ్చింది మోనాలిసా. కొంతకాలంగా ఎక్కడా కనిపించని మోనాలిసా.. ఈ పాటకోసం బయటికి వచ్చేసరికి మళ్లీ ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఒక కెమెరామన్ మోనాలిసాతో ఫొటో తీయించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వీడియోకు 2.7 మిలియన్ వ్యూస్ రాగా.. 50 వేల లైకులు వచ్చాయి. కామెంట్స్ లో మోనాలిసా సినిమా ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కుంభమేళాలో చూసిన మోనాలిసాకు, ఇప్పుడు చూస్తోన్న మోనాలిసాకు చాలా తేడా కనిపిస్తోందని, ఆమె స్టైల్ మారిపోయిందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఎందుకు ఆమెను ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుంభమేళా ఆమె జీవితాన్నే మార్చేసిందని ఇంకొందరు అంటున్నారు.
ఉత్కర్ష్ సింగ్ తో కలిసి పాట
A post shared by Instant Bollywood (@instantbollywood)
నెటిజన్ల అభిప్రాయాలు
A post shared by Instant Bollywood (@instantbollywood)
మొత్తంమీద, కుంభమేళా తర్వాత మోనాలిసా జీవితం మారిపోయింది. ఆమె తన సోషల్ మీడియా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.


