|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Monica Song Coolie: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వచ్చేసింది

Published: 11-07-2025, 9:13 AM
Monica Song Coolie: పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వచ్చేసింది

సుపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా నుండి రెండవ పాట ‘మోనికా’ విడుదలైంది. ఈ పాటలో పూజా హెగ్డే స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించింది. రెడ్ డ్రెస్ లో ఆమె డ్యాన్స్ అద్భుతంగా ఉంది.

Key Points

1

పూజా హెగ్డే 'కూలీ' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

2

రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామర్ లుక్ చూపించింది.

4

ఆగస్టు 14న 'కూలీ' సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

పూజా హెగ్డే గ్లామర్ లుక్

సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్‌లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్‌ఫుల్‌గానే ఉంది.

‘మోనికా’ సాంగ్ విశేషాలు

‘కూలీ’ సినిమా విడుదల తేదీ

ఈ పాటని వైజాగ్ పోర్ట్‌లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ‘కూలీ’లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.

‘కూలీ’ సినిమాలోని ‘మోనికా’ సాంగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అనిపిస్తుంది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.