|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన వెబ్‌ సిరీస్‌, సినిమాలు ఇవే!

Published: 22-06-2025, 3:13 AM
ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన వెబ్‌ సిరీస్‌, సినిమాలు ఇవే!

కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ కథనం 2024లో అత్యధికంగా వీక్షించబడిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి వివరిస్తుంది. మీర్జాపూర్, సేవ్ ది టైగర్స్ వంటివి ఎన్ని కోట్ల మంది వీక్షించారో తెలుసుకుందాం.

Key Points

1

మీర్జాపూర్ సీజన్ 3 అత్యధికంగా వీక్షించబడిన హిందీ వెబ్ సిరీస్

2

తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 అత్యధిక వీక్షణలు సాధించింది

4

హిందీ కంటెంట్ ఓటీటీలో అగ్రస్థానంలో ఉంది

ఓటీటీలో వెబ్ సిరీస్‌ల ఆధిపత్యం

కోవిడ్‌ తర్వాత ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ)ల వాడకం ఎక్కువైంది. మహమ్మారి సమయంలో థియేటర్స్‌ మూత పడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలవైపు మొగ్గుచూపారు. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కావడంతో వీక్షకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది. గతేడాది(2024) నాటికి దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 55 కోట్లకు చేరిందంటేనే దీని స్పీడ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఓటీటీలలో సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌ల హవానే ఎక్కువగా కొనసాగుతుంది.

అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు

గతేడాదిలో రిలీజైన 315 ఒరిజినల్స్‌లో 214 వెబ్‌ సిరీస్‌లే ఉన్నాయి. అత్యధిక మంది చూసిన వెబ్‌ సిరీస్‌గా మీర్జాపూర్‌ సీజన్‌ 3 నిలిచింది. ఈ హిందీ వెబ్‌ సిరీస్‌ని 3 కోట్ల మంది వీక్షించారు. ఇక తెలుగులో సేవ్‌ ద టైగర్స్‌ సీజన్‌ 2ని అత్యధికంగా(50లక్షల మంది) వీక్షించారట.

భాషావారీ కంటెంట్ విశ్లేషణ

సినిమాల విషయానికొస్తే దో పత్తీ(హిందీ)ని 1.51 మంది ఓటీటీలో చూశారు. ఇంటర్నేషనల్‌ షోలలో.. స్వీడ్‌ గేమ్‌ సీజన్‌ -2ని 1.96 మంది భారతీయులు వీక్షించారు. కంటెంట్‌ పరంగా హీందీ అగ్రస్థానంలో ఉంది. ఓటీటీలో వస్తున్న మొత్తం ఒరిజినల్స్‌లో మూడింట రెండొంతులు బాలీవుడ్‌ నుంచే ఉందట. బెంగాలీ 2వ స్థానంలో ఉండగా.. 9 శాతం వాటాలతో తెలుగు మూడో స్థానంలో ఉంది.

మొత్తం మీద, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వెబ్ సిరీస్‌లు, సినిమాలకు ఎంతో ఆదరణ లభిస్తుందని ఈ నివేదిక తెలియజేస్తుంది. హిందీ కంటెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉందని కూడా స్పష్టమవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.