
📌 Key Points
- మోటో G37, G37 పవర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తాయి.
- రెండు మోడల్స్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 120Hz HD+ LCD డిస్‌ప్లే ఉన్నాయి.
- మోటో G37 ధర సుమారు రూ. 27,700, G37 పవర్ ధర సుమారు రూ. 31,000 (జర్మనీలో).
- మోటో G37 పవర్ 5,200mAh బ్యాటరీతో వస్తుంది, 20W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మోటోరోలా కొత్తగా రెండు మోటో జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో G37 మరియు మోటో G37 పవర్ మోడల్స్ శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా మరియు ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో వస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాలను తెలుసుకుందాం.
మోటో G37 సిరీస్ ధర, లభ్యత వివరాలు
Moto G37 Series : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో రెండు మోటో జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. మోటో జీ37, మోటో జీ37 పవర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ రెండు మోటో జీ37 సిరీస్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
మోటో జీ37, మోటో జీ37 పవర్ ధర : ఈ స్మార్ట్‌ఫోన్‌లు జర్మనీలో సేల్స్ అందుబాటులో ఉన్నాయి. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో మోటో G37 వేరియంట్ (Moto G37 Series) ధర 249 యూరోలు (సుమారుగా రూ. 27,700) ఉంటుంది. 4GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో మోటో జీ37 పవర్ వేరియంట్ ధర 279 యూరోలు (సుమారుగా రూ. 31వేలు)గా ఉన్నాయి.
మోటో G37 ఫ్యాంటోన్ నాటికల్ బ్లూ, ప్యాంటోన్ ఫ్యూసియా రెడ్, ప్యాంటోన్ ఇంపెటరబుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటో జీ37 పవర్ ఫోన్ కూడా ప్యాంటోన్ నాటికల్ బ్లూ, ప్యాంటోన్ ఇంపెటరబుల్, ప్యాంటోన్ క్యాప్రి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
మోటో G37 స్పెసిఫికేషన్లు: ప్రత్యేకతలు
Read Also : Apple iPhone 15 : ఐఫోన్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఇలా కొన్నారంటే.. రూ. 22వేలు తగ్గింపుతో ఐఫోన్ 15 మీ సొంతం..!
మోటో G37 స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1,050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ ఉన్నాయి. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ మాలి-G57 జీపీయూతో రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. మోటో G37లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా లైట్ అండ్ ఫ్లిక్కర్ ఫీచర్‌తో ఇంటిగ్రేటెడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
మోటో G37 పవర్: బ్యాటరీ, ఇతర ఫీచర్లు
కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. మోటో జీ37 5,200mAh బ్యాటరీ, 20W టర్బోపవర్ ఛార్జింగ్ 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
మోటో G37 పవర్ స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌లో మోటో G37 మాదిరిగానే అదే ఆపరేటింగ్ సిస్టమ్, డిస్‌ప్లే, చిప్‌సెట్, రియర్ కెమెరా యూనిట్ ఉన్నాయి. మోటో G37 పవర్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. 30W టర్బోపవర్ 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 78 గంటల వరకు ఛార్జ్ వస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్‌కు సపోర్టు ఇచ్చే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 166.23 x 76.50 x 8.89mm, బరువు సుమారుగా 215 గ్రాములు ఉంటుంది.
మోటో G37 సిరీస్ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో, సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ ఫోన్‌లు మార్కెట్లో మంచి పోటీని ఇవ్వనున్నాయి. మీ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకోవచ్చు.


