
లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మౌళి తనూజ్ ప్రశాంత్ ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్. తాజా ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Key Points
లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన మౌళి తనూజ్ ప్రశాంత్.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఫేమస్ అయిన మౌళి.
ఇంజనీరింగ్ సీనియర్ పై క్రష్ ఉందని వెల్లడించాడు.
సినిమాలోని లవ్ స్టోరీ, నిజ జీవితంలోని క్రష్ గురించి ఆసక్తికర విషయాలు.
లిటిల్ హార్ట్స్ హీరో మౌళి యొక్క సోషల్ మీడియా ప్రయాణం
Mouli Tanuj Prasanth : ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు మౌళి తనూజ్ ప్రశాంత్. అయితే మౌళికి ముందు నుంచి సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మౌళి 90s సిరీస్ తో అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు హీరోగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు.(Mouli Tanuj Prasanth)
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ గురించే వినిపిస్తుంది. తాజాగా మౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి చెప్పమన్నారు.
మౌళి యొక్క నిజ జీవిత ప్రేమ కథ
దీంతో మౌళి మాట్లాడుతూ.. లవ్ లాంటిది కాదు కానీ క్రష్ ఫీలింగ్ ఉంది. ఇంజనీరింగ్ లో మా సీనియర్ ఒక అమ్మాయి ఉంది. డ్యాన్స్ క్లబ్ లో ఆమె డ్యాన్స్ చేసేది. దూరం నుంచి ఆమె డ్యాన్స్ ని చూసేవాడిని రాజా సినిమాలో వెంకటేష్ లాగా. ఆమెని అలా చూస్తూ ఉండేవాడిని అంతే. తర్వాత కాంటాక్ట్ లేదు. 90s సిరీస్ రిలీజ్ తర్వాత తనే ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. ఇప్పుడు ఏం కాంటాక్ట్ లేదు అని తెలిపాడు.
సినిమా మరియు నిజ జీవితం మధ్య పోలికలు
లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తన కంటే మూడేళ్లు పెద్దయిన అమ్మాయిని లవ్ చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా సీనియర్ మీద క్రష్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలను సరదాగా వైరల్ చేస్తున్నారు.
మౌళి తనూజ్ ప్రశాంత్ లవ్ స్టోరీ, సినిమా లవ్ స్టోరీతో పోలిస్తే ఎలా ఉందో తెలుసుకున్నాం. తన సీనియర్ పై క్రష్ అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.


