|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైత్రీ మూవీస్‌తో మౌళి మాస్ ఎంట్రీ! ‘దొంగనా కొడుకు’ టైటిల్‌తో షాకింగ్ అప్‌డేట్!

Published: 14-04-2026, 6:05 AM
మైత్రీ మూవీస్‌తో మౌళి మాస్ ఎంట్రీ! 'దొంగనా కొడుకు' టైటిల్‌తో షాకింగ్ అప్‌డేట్!
  • మౌళి హీరోగా ‘దొంగనా కొడుకు’ మూవీ టైటిల్ ఫిక్స్ – మైత్రీ మూవీస్ బ్యానర్‌లో భారీ చిత్రం!
  • ‘#90s’ వెబ్ సిరీస్‌తో నటుడిగా గుర్తింపు, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో హీరోగా సక్సెస్ అందుకున్న మౌళి.
  • మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కామెడీ టైమింగ్‌తో వస్తున్న చిత్రం – ‘దొంగనా కొడుకు’.
  • త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి – మౌళి కెరీర్‌లోనే మైలురాయిలా ఈ చిత్రం!

సోషల్ మీడియా సెన్సేషన్ మౌళి ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘దొంగనా కొడుకు’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఒక పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీనితో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మౌళి హీరోగా ‘దొంగనా కొడుకు’ మూవీ

Mouli: సోషల్ మీడియాలో తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న మౌళి, ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘#90s’ వెబ్ సిరీస్‌తో నటుడిగా తనలోని ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో, ఇపుడు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు.

మైత్రీ మూవీస్ నిర్మాణంలో కామెడీ ట్రీట్

అందులో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒక సినిమా ఒకటి. మౌళి(Mouli) హీరోగా వస్తున్న ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. సాధారణంగా సినిమాలకు హుందాగా ఉండే పేర్లు పెడుతుంటారు, కానీ ఈ టైటిల్ మాస్ ప్రేక్షకులకు దగ్గరగా ఉండటంతో పాటు ఒక రకమైన సరదా వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ వెరైటీ పేరు వినగానే సినిమా ఎంత సరదాగా ఉండబోతుందో అర్థమవుతోంది. మౌళి కామెడీ టైమింగ్‌కు పక్కాగా సరిపోయే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

టైటిల్‌తోనే వైరల్ అవుతున్న సినిమా

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ తెగ వైరల్ అవుతోంది, దీనితో సినిమాపై అప్పుడే అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకే కాకుండా, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఎంతో రిచ్‌గా నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. మౌళి కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

మౌళి కెరీర్‌కు ఈ సినిమా ఒక మైలురాయి కానుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.