|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా ఒకటి… క్లైమాక్స్‌లు రెండు

Published: 04-06-2025, 8:16 PM
సినిమా ఒకటి... క్లైమాక్స్‌లు రెండు

ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడం ఇప్పుడు పెద్ద సవాలు. తాజాగా ‘హౌస్ ఫుల్ 5’ సినిమా ఒక వినూత్న వ్యూహంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండు వేర్వేరు క్లైమాక్స్ లున్న ఈ సినిమా..

Key Points

1

హౌస్‌ఫుల్ 5 సినిమా రెండు వేర్వేరు క్లైమాక్స్‌లతో విడుదలవుతోంది.

2

‘హౌస్‌ఫుల్ 5ఏ’ మరియు ‘హౌస్‌ఫుల్ 5బీ’ ఒకే రోజున విడుదల అవుతున్నాయి.

4

ఈ వినూత్న వ్యూహం ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి ఉద్దేశించబడింది.

హౌస్ ఫుల్ 5 యొక్క వినూత్న వ్యూహం

ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్‌లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్‌ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్‌లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్‌ ఆడియన్స్‌ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్‌ హీరోల సినిమాలకు సైతం రిపీట్‌ ఆడియన్స్‌ ఉండటం లేదు.

ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా స్ట్రీమింగ్‌ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్‌లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్‌లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’ యూనిట్‌ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 5ఏ అండ్‌ 5బీ హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీస్‌లో ‘హౌస్‌ఫుల్‌’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్‌ఫుల్‌ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, అభిషేక్‌ బచ్చన్, సంజయ్‌ దత్, ఫర్దీన్‌ ఖాన్, శ్రేయాస్‌ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌… ఇలా ప్రముఖ తారలు ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాలో నటించారు. తరుణ్‌ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్‌ఫుల్‌ 5ఏ, హౌస్‌ఫుల్‌ 5బీ’ అంటూ రిలీజ్‌ చేస్తున్నారు. కానీ… ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు.

రెండు క్లైమాక్స్ లతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం

ఒకే సినిమాకు రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లు ఉంటాయన్నమాట. అంటే… ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్‌ ఉంటే, ‘హౌస్‌ఫుల్‌ 5బీ’లో మరో డిఫరెంట్‌ క్లైమాక్స్‌ ఉంటుంది. అలాగే  ‘హౌస్‌ఫుల్‌ 5ఏ, హౌస్‌ఫుల్‌ 5బీ’… ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్‌ కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు.

ఒకే సినిమా, రెండు అనుభవాలు

‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్‌ఫుల్‌ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లతో రాబోతోంది. మరి… మీరు ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్‌ఫుల్‌ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్‌ చేశారు అక్షయ్‌ అండ్‌ రితేష్‌. ఇదిలా ఉంటే… ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్‌ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’లో కిల్లర్‌ ఒకరైతే, ‘హౌస్‌ఫుల్‌ 5బీ’లో కిల్లర్‌ మరొకరు ఉంటారట. తొలి ఇండియన్‌ సినిమా! కొన్ని సినిమాలు స్టార్టింగ్‌ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్‌లో మాత్రం ఆడియన్స్‌ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్‌ఫుల్‌ 5’ టీమ్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్‌ఫుల్‌ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్‌ ‘హౌస్‌ఫుల్‌ 5బీ’ సినిమా క్లైమాక్స్‌ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లొచ్చు. అలాగే ‘5బీ’ చూసినవాళ్లు ‘5ఏ’ క్లైమాక్స్‌ ఇంకా బాగుందని వింటే… ఆ వెర్షన్‌ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్‌టాక్‌గా మారి, ప్రమోషన్‌కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్‌కు వచ్చే ఆడియన్స్‌ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్‌ ఆడియన్స్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయితే… హౌస్‌ఫుల్‌ టీమ్‌ వ్యూహం సక్సెస్‌ అయినట్లే లెక్క. మరి… ఈ ‘హౌస్‌ఫుల్‌ 5’ టీమ్‌ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే… రెండు డిఫరెంట్‌ క్లైమాక్స్‌లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’ అంటూ బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి ప్రయోగాలు ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి తీసుకురావడంలో ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. ‘హౌస్ ఫుల్ 5’ విజయం ఈ వ్యూహం యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.