
📌 Key Points
- రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ జనవరి 1న ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
- మోగ్లీ సినిమా 7.1 IMDb రేటింగ్ సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- రామాయణం, కర్మ సిద్ధాంతంతో ముడిపడిన ఒక వినూత్న ప్రేమకథ ఇది.
- నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం మోగ్లీ.
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. కేవలం 17 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న ఈ చిత్రం, 7.1 రేటింగ్‌తో ఆకట్టుకుంటోంది. రామాయణం, కర్మతో లింక్ అయిన ఈ ప్రేమకథా చిత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం.
మోగ్లీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ’ (Mowgli 2025) స్ట్రీమింగ్ కానుంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న మోగ్లీ ఓటీటీ రిలీజ్ కానుంది. 7.1 రేటింగ్ సాధించిన మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ యాంకర్ సుమ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ కలయికలో వచ్చిన వినూత్న ప్రేమకథ ‘మోగ్లీ’. థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సినీ ప్రియులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు మరికొన్ని గంటల్లోనే మోగ్లీ ఓటీటీ లోకి అడుగుపెట్టబోతోంది.
కథా నేపథ్యం, కీలక పాత్రలు
వీరిద్దరి స్వచ్ఛమైన ప్రేమకథలోకి ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ ప్రవేశించడంతో కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? తన ప్రేమను కాపాడుకోవడానికి ఆ ‘ మోగ్లీ ’ ఎంతటి సాహసం చేశాడనేది ఈ చిత్ర ప్రధానాంశం.
అలాగే, రోషన్ కనకాల, విలన్‌గా చేసిన బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాంటి మోగ్లీ ఓటీటీలోకి మరికొన్ని గంట్లలో అంటే జనవరి 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కేవలం 17 రోజుల్లో మోగ్లీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
మోగ్లీ సినిమాకు వచ్చిన ప్రశంసలు
ఇదిలా ఉంటే, మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల సరసన హీరోయిన్‌గా సాక్షి మడోల్కర్ నటించింది. వెర్సటైల్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ విలన్‌గా మెప్పించారు. ‘కలర్ ఫోటో’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందీప్ రాజ్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.
సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమా రోషన్ కనకాల నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం, కొత్త సంవత్సరం రోజున సినీ ప్రియులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం.


