|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ మూవీపై ఎంపీ ఫైర్! ‘ధురంధర్-2’ బక్వాస్ అంటున్న ఒవైసీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 28-03-2026, 6:05 AM
రణ్‌వీర్ మూవీపై ఎంపీ ఫైర్! ‘ధురంధర్-2’ బక్వాస్ అంటున్న ఒవైసీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్!
  • ‘ధురంధర్-2’పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు – సినిమా బక్వాస్ అన్నారు!
  • రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్-2’ మూవీపై ఒవైసీ ఫైర్ – టైం వేస్ట్ అన్నారు!
  • 2026లో విడుదలై రూ. 1100 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్-2’ సినిమాను విమర్శించిన ఒవైసీ!
  • పాకిస్థాన్ టెర్రరిస్టుల కథతో వచ్చిన ‘ధురంధర్-2’పై ఒవైసీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ సినిమాపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను ఆయన బక్వాస్ అని విమర్శించడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అసలు ఒవైసీ ఎందుకు అలా అన్నారు?

‘ధురంధర్-2’పై ఒవైసీ ఫైర్.. అసలు ఏమైంది?

ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా బాలీవుడ్ సినిమా ‘ధురంధర్-2’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు వసూలు చేస్తున్నా, ఒవైసీకి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదని అర్థమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మూవీ కేవలం బక్వాస్ అని కొట్టిపారేశారు. ధురంధర్-2 గురించి ఒవైసీని ప్రశ్నించగా.. “అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు అంతా సోది చూపించారు. నాకు అలాంటి చిత్రాలు చూడటానికి మూడు గంటల టైమ్ లేదు. అందులో బూతులు, హింస తప్ప ఏముంది? ఆ సినిమా చూసిన తర్వాత ముస్లింలను తిట్టాలా వద్దా అని జనం ఆలోచించేలా చేస్తున్నారు. ఇలాంటివి చూడటానికి ఎవరికి తీరిక ఉంటుంది?” అని ఆయన ఘాటుగా విమర్శించారు.

ప్రపంచమంతా ఈమూవీ చూసి మెచ్చుకుంటోంది కదా అని యాంకర్ అడగగా, ఒవైసీ తనదైన హైదరాబాదీ స్టైల్‌లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. “మా హైదరాబాద్‌లో ఒక సామెత ఉంది.. ప్యారే, ఇలాంటి విషయాలను మనసుకి తీసుకోకు, శవం మీద వేసేయ్ అని అంటారు. మేము కూడా అలాగే దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాము” అని తనదైన శైలిలో చురకలు వేశారు. ఒవైసీ ఎన్ని విమర్శలు చేసినా, ‘ధురంధర్ 2’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక ఇండియన్ స్పై పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులను ఎలా అంతం చేశాడనే కథతో వచ్చిన ఈచిత్రం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది.

సినిమా చూడటానికి టైమ్ లేదు.. ఒవైసీ షాకింగ్ కామెంట్స్!

బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపినా విమర్శలు తప్పని ‘ధురంధర్-2’!

‘ధురంధర్-2’ సినిమాపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.