|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘హై జవానీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పించే న్యూస్ చెప్పిన మృణాల్!!

Published: 12-04-2026, 11:35 AM
షాకింగ్: 'హై జవానీ' రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పించే న్యూస్ చెప్పిన మృణాల్!!
  • వరుణ్, మృణాల్, పూజా హెగ్డే కలయికలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ విడుదల తేదీ ఖరారు!
  • డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదల కానుంది.
  • ఏప్రిల్ 13న ఫస్ట్ లుక్ విడుదల, మే 22న గ్రాండ్ రిలీజ్ అంటూ మృణాల్ ప్రకటన.
  • ‘చాంద్ మేరా దిల్’, ‘బందర్’ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ వరుణ్ ధావన్ ధీమా!

వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అందరిలోనూ ఒక ప్రశ్నగా ఉండేది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది! ఇక రచ్చ షురూ!

మే 22న ‘హై జవానీ’ విడుదల!

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెరకెక్కిన క్రేజీ ఎంటర్టైనర్ విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న గందరగోళానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెక్ పెట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ, ఆ తర్వాత జూన్ 5కి మార్చారు. ఇప్పుడు అంతకంటే ముందే, అంటే మూడు వారాల ముందే మే 22న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. “ప్రేమ, గందరగోళం, పిచ్చి, అలజడి ఇప్పుడే మొదలవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ 13న రాబోతోంది.. మే 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది” అని పోస్ట్ పెట్టింది.

అయితే ఇంతియాజ్ అలీ ‘మై వాపస్ ఆవుంగా’ సినిమాతో వచ్చే రిస్క్ తీసుకోకుడదని మేకర్స్ తెలివిగా విడుదల తేదీని ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మే 22న కూడా వరుణ్ ధావన్ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. అదే రోజు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘చాంద్ మేరా దిల్’, అనురాగ్ కశ్యప్ ‘బందర్’ వంటి చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు తప్పదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించాయి. అందుకే ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో టిప్స్ సంస్థ తరపున రమేష్ తౌరానీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం.

ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ!

మొత్తానికి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదల తేదీపై క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.