|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవకాశాలు రావాలంటే హద్దులు దాటాల్సిందే! మృణాల్ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు

Published: 22-12-2025, 6:04 AM
అవకాశాలు రావాలంటే హద్దులు దాటాల్సిందే! మృణాల్ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు
  • ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.
  • అవకాశాల కోసం హద్దులు దాటాలని మృణాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
  • భాషకు పరిమితం కాకుండా మంచి కథలుంటే ఎక్కడైనా నటిస్తానని వెల్లడించింది.
  • తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ఎమోషనల్ అయ్యింది, ప్రస్తుతం ‘డెకాయిట్’లో నటిస్తోంది.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్, అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘హద్దులు దాటితేనే గొప్ప అవకాశాలు వస్తాయి’ అని ఆమె స్పష్టం చేసింది. తెలుగు ప్రేక్షకులపై తన ప్రేమను, రాబోయే సినిమాల వివరాలను పంచుకుంది. ఆమె సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రస్థానం

Mrunal Thakur : హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది ఈ బ్యూటీ. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.

మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ‘ఫ్యామిలి స్టార్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదే సమయంలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. మృణాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన సినిమాలపై ఆసక్తికరంగా స్పందించారు.

హద్దులు దాటితేనే అవకాశాలు: మృణాల్

నేను ఒక భాషకు మాత్రమే పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హద్దులు దాటితేనే గొప్ప అవకాశాలు వస్తాయి. భాష అనేది కేవలం భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం మాత్రమే. మంచి కథ ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించడానికి నేను సిద్ధమని స్పష్టం చేసి తన ఆశయాలను బయటపెట్టింది. ఒక నటిగా అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలని నా కోరిక. మంచి కథ ఉంటే.. ప్రపచంలో ఎక్కడికైనా ఏ భాషలోనైనా వెళ్లి నటిస్తానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

తెలుగుపై మృణాల్ ప్రేమ, కొత్త ప్రాజెక్ట్‌లు

ఇక టాలీవుడ్‌పై స్పందిస్తూ..తెలుగు సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎంతో గౌరవం దక్కింది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే తనకు పుట్టింటికి వచ్చినంత గౌరవం కలుగుతోందని ఎమోషనల్ అయ్యింది. ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తుండగా.. తెలుగులో ‘డెకాయిట్’ చేస్తుంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. షానీల్ డియో దర్శకత్వంలో రాబోతుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంతో మృణాల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు ఆమె కెరీర్ పట్ల దృఢ నిశ్చయాన్ని, భాషా హద్దులు లేని ఆశయాలను ప్రతిబింబిస్తాయి. తెలుగు ప్రేక్షకులతో ఆమెకున్న బంధం, కొత్త ప్రాజెక్ట్‌లతో ఆమె భవిష్యత్ ప్రస్థానం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.