
‘సీతారామం’ సినిమాతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట సంచలనం సృష్టించింది. ఆమె చేతికి మెహందీ, గాజులు ఉన్నాయి. దీంతో ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియోలో ఆమె చేతికి మెహందీ, గాజులు ఉన్నాయి.
ఆమె పెళ్లి చేసుకుందా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘సీతారామం’ తర్వాత మృణాల్ కెరీర్ బాగుంది, ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది.
మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో
‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్(Adivishesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’(Decoit) మూవీతో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది. మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ తన గ్లామర్‌తో అండ్ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో గత్తరలేపుతుంది.
అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన స్టోరీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఓ వీడియో షేర్ చేస్తూ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీ పిల్లికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది’ అని రాసుకొచ్చింది. అయితే ఆ వీడియోలో పెళ్లి కూతురిలా చేతికి మెహందీతో పాటు చేతినిండా గాజులు వేసుకుంది. అయితే ఆ హ్యాండ్స్ ఎవరివో తెలియట్లేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ మృణాల్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
సీక్రెట్ మ్యారేజ్ అనుమానాలు
అభిమానుల ప్రతిచర్యలు
మృణాల్ ఠాకూర్ సీక్రెట్ మ్యారేజ్ గురించి వార్తలు వైరల్‌గా మారాయి. అయితే, ఇది నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.


