|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నా భాగస్వామి’ అంటూ వీడియో పంచుకున్న మృణాల్ ఠాకూర్.. నెట్టింట వైరలవుతోన్న పోస్ట్

Published: 02-06-2025, 1:03 PM
‘నా భాగస్వామి’ అంటూ వీడియో పంచుకున్న మృణాల్ ఠాకూర్.. నెట్టింట వైరలవుతోన్న పోస్ట్

హాయ్ నాన్న సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘నా భాగస్వామి’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Key Points

1

మృణాల్ ఠాకూర్ తన స్నేహితులతో డ్యాన్స్ వీడియోను పంచుకుంది.

2

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4

మృణాల్ ఠాకూర్ 'హాయ్ నాన్న' సినిమాతో పెద్ద పేరు తెచ్చుకుంది.

మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో

హాయ్ నాన్నతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ 2012లో ముజ్సే కుచ్ కెహెతి ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి. 2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత మారుతితో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమాలో నటించింది. మృణాల్ ఠాకూర్‌ హైలెట్‌గా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ సినిమాను నాని అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇకపోతే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను కవ్విస్తుంటుంది. తాజాగా మృణాల్ నెట్టింట ఓ పోస్ట పెట్టింది. ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ వేస్తోన్న వీడియో పంచుకుంది. ‘‘నువ్వు నాకు ఇష్టమైన క్రైమ్ పార్టనర్ @deepalid10#workoutkamdancejyaada’’ అని వీడియోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ వీడియో వీక్షించిన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

హాయ్ నాన్న ఫేమ్ మృణాల్

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పోస్టులు ఎల్లప్పుడూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.