
📌 Key Points
- MSVPG చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
- ‘శశిరేఖ’ పాటలో చిరంజీవి వింటేజ్ లుక్ వైరల్ అవుతోంది.
- చిరంజీవి గుర్రంపై కనిపించే సన్నివేశం ‘శుభలేఖ రాసుకున్న’ను గుర్తుచేస్తుంది.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న MSVPG చిత్రం నుంచి ‘శశిరేఖ’ పాట విడుదలైంది. ఈ పాటలో చిరంజీవి వింటేజ్ లుక్, ‘శుభలేఖ రాసుకున్న’ సినిమాను గుర్తుచేసే సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
MSVPG చిత్రం విడుదల, పాట అప్‌డేట్‌లు
MSVPG Film: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(మన shankara vara Prasad Garu). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2026 జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తే చిత్రబృందం పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను పెంచేస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శశిరేఖ పూర్తి లిరికల్ సాంగ్ విడుదల కావడంతో ఇందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .
ఇక ఈ పాటలో చిరంజీవి వింటేజ్ లుక్ వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.. చిరంజీవి ఈ పాటలో ఒక సన్నివేషంలో గుర్రాన్ని పట్టుకొని అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ సన్నివేశం అచ్చం చిరంజీవి శుభలేఖ రాసుకున్న అనే పాట సన్నివేశాన్ని పోలి ఉందని, ఈ సినిమాలో అనిల్ రావిపూడి చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించబోతున్నారు అంటూ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. శశిరేఖ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో చిరంజీవి నయనతార మధ్య రొమాంటిక్ పాటగా కొనసాగబోతుందని తెలుస్తోంది.
శశిరేఖ పాటలో వింటేజ్ చిరంజీవి
ఇదివరకే మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల పాటను విడుదల చేశారు. ఈ పాట మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తాజాగా రెండో పాటను కూడా విడుదల చేయడంతో ఈ పాట కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాటను భీమ్స్, మధుప్రియ ఆలపించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సంక్రాంతి పండుగకు సరిగ్గా సరిపోయే సినిమా అనే చెప్పాలి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.. మరి ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి మెగా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమా పనులలో కూడా చిరంజీవి బిజీగా ఉన్నారు.
అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్ అంచనాలు
‘శశిరేఖ’ పాట విడుదలతో MSVPG చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. అనిల్ రావిపూడి, చిరంజీవి కలయికలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.


