
📌 Key Points
- చిరంజీవి కంటే జరీనా వహాబ్ వయసు తక్కువ ఉండటం మీమర్స్‌కు చిక్కింది.
- దర్శకుడు అనిల్ రావిపూడిపై నెటిజన్లు ట్రోల్స్, కామెంట్లు చేస్తున్నారు.
- మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి విడుదలైంది.
- సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ వయసు చిరంజీవి కంటే తక్కువగా ఉండటంతో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సినిమాలో వయసు వ్యత్యాసంపై ట్రోల్స్
MSVPG Movie:ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే అందులో ఏ పాత్రలో ఎవరు నటిస్తే ఆ పాత్రకు జీవం పోస్తారో అన్న విషయాలు దర్శక రచయితలకు బాగా తెలుసు. అందుకే ఎవరైతే తామనుకున్న పాత్రకు సెట్ అవుతారో వారినే ఆ పాత్రలలో నటింపచేసేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నటీనటుల ఎంపిక, పాత్రల మధ్య సంబంధాలు సృష్టించడంలో అంతా ఓకే కానీ ఆ పాత్రల మధ్య వయసు తేడా ఒక్కొక్కసారి విమర్శలకు గురయ్యేలా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన సినిమాలో చిరంజీవి కంటే తల్లి వయసే చిన్నది కావడం గమనార్హం. ఇది చూసిన ఆడియన్స్ ఏంటి అనిల్ గారు ఈ విషయం తెలియదా? చూసుకోవాలి కదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా చూసిన కొంతమంది మీమర్స్ కొన్ని విషయాలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో చిరంజీవికి తల్లిగా ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వహాబ్ నటించారు. అయితే ఆమె వయసు 66 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇక చిరంజీవి వయసు 70 సంవత్సరాలు.
అనిల్ రావిపూడి దర్శకత్వంపై విమర్శలు
ఈ విషయాన్ని పసిగట్టిన మీమర్స్..అమ్మ వయసు 66.. కొడుకు వయసు 70 సంవత్సరాలు అంటూ వారిద్దరి మధ్య ఏజ్ తేడాను హైలైట్ చేస్తూనే .. “నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఈవిడే మా అమ్మ. నేనే తన కొడుకుని అంటూ చిరంజీవి డైలాగ్ కొట్టినట్టుగా ఆ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది . మొత్తానికైతే ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఇది చూసిన మెగా అభిమానులు, నెటిజన్స్ ఏంటి అనిల్ గారు చూసుకోవాలి కదా.. ఇలాంటి మీమ్స్ వస్తాయని మీకు తెలియదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి పాత్రల మధ్య వయసు వ్యత్యాసం చాలా సహజమని చెప్పాలి. మొత్తానికైతే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇలాంటి మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి.
వైరల్ అవుతున్న మీమ్స్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే.. నయనతార హీరోయిన్ గా నటించింది. సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక మొదటి రోజే 28 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.
BIG TV తెలుగు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి Tags Chiranjeevi Mana Shankar varaprasad garu Share
మొత్తానికి మన శంకరవరప్రసాద్ గారు సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నా, ఇలాంటి మీమ్స్ సినిమాపై వైరల్ అవుతున్నాయి. వయసు వ్యత్యాసాలు సాధారణమే అయినా, ప్రేక్షకులు వీటిని గమనించడం ఆసక్తికరంగా మారింది.


