|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ “మన శంకర్ వరప్రసాద్” ట్రైలర్ వచ్చేస్తోంది: తేదీ, వేదికపై ఆసక్తి!

Published: 01-01-2026, 8:00 AM
మెగాస్టార్ "మన శంకర్ వరప్రసాద్" ట్రైలర్ వచ్చేస్తోంది: తేదీ, వేదికపై ఆసక్తి!
  • ‘మన శంకర్ వరప్రసాద్’ ట్రైలర్ జనవరి 4న విడుదల కానుందని వార్తలు.
  • ట్రైలర్ లాంచ్ రాజమండ్రి లేదా తిరుపతిలో జరిగే అవకాశం ఉందని ప్రచారం.
  • మునుపటి ఈవెంట్లకు దూరంగా ఉన్న చిరంజీవి, ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనేది సస్పెన్స్.
  • సినిమాలో వెంకటేష్ దాదాపు 25 నిమిషాల పాటు క్యామియో పాత్రలో కనిపించనున్నారు.

చిరంజీవి నటించిన “మన శంకర్ వరప్రసాద్” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 4న సినిమా ట్రైలర్ విడుదల కానుందని, రాజమండ్రి లేదా తిరుపతిలో లాంచ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి హాజరుపై, ట్రైలర్ లాంచ్ వేదికపై ఉత్కంఠ నెలకొంది.

ట్రైలర్ లాంచ్ తేదీ, వేదికపై సస్పెన్స్

MSVPG film trailer: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాని జనవరి 12వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుసగా మూడు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించి ట్రైలర్ విడుదల చేయబోతున్నారని సమాచారం.. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జనవరి 4వ తేదీ రాజమండ్రి లేదా తిరుపతిలో నిర్వహించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే ఇదే విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహించగా ఏ కార్యక్రమానికి కూడా చిరంజీవి హాజరు కాలేదు. మరి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నైనా చిరంజీవి పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి హాజరుపై ఉత్కంఠ

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 7వ తేదీ నిర్వహించబోతున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో థర్డ్ సింగిల్ ఆర్ యు రెడీ అంటూ వెంకటేష్ చిరంజీవి మధ్య కొనసాగే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

క్యామియో పాత్రలో వెంకటేష్..

వెంకటేష్ క్యామియో, ఇతర విశేషాలు

ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు 25 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ హైలెట్ గా ఉండబోతున్నాయని ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సన్ షైన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తంగా, “మన శంకర్ వరప్రసాద్” ట్రైలర్ విడుదల, చిరంజీవి హాజరు, మరియు వెంకటేష్ క్యామియోపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటనతో ఈ సస్పెన్స్ కు తెరదించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.