|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mufti Police: ‘మఫ్తీ పోలీస్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న అర్జున్

Published: 06-11-2025, 12:22 PM
Mufti Police: ‘మఫ్తీ పోలీస్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ నటించిన ‘మఫ్తీ పోలీస్’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. అర్జున్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి.

Key Points

1

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2

నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల.

4

అర్జున్ ఇంటెన్స్ లుక్‌తో విడుదలైన పోస్టర్, టీజర్ భారీ అంచనాలను పెంచాయి.

‘మఫ్తీ పోలీస్’ చిత్ర విశేషాలు

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘మఫ్తీ పోలీస్’. నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీని నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ‘మఫ్తీ పోలీస్’ చిత్రం నవంబర్ 21న వరల్డ్ వైడ్‌గా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ అర్జున్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన పోస్టర్ విడుదల చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచగా.. మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానుంది. కాగా.. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు.

రిలీజ్ డేట్, భాషలు

టీజర్, సినిమా అంచనాలు

యాక్షన్ కింగ్ అర్జున్ అభిమానులు ‘మఫ్తీ పోలీస్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.