|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సజ్జనార్ సార్‌కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న

Published: 18-11-2025, 3:16 AM
సజ్జనార్ సార్‌కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న

సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. అతని టాలెంట్‌ను కొందరు ప్రశంసించగా, తండ్రి అప్పారావు మాత్రం కన్నీళ్లతో సీపీ సజ్జనార్‌ను వేడుకున్నారు. మనవరాలి భవిష్యత్తు కోసం రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Key Points

1

‘ఐబొమ్మ’ ఇమ్మడి రవిని సినిమా పైరసీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

2

రవి టాలెంట్‌ను నటుడు శివాజీతో పాటు నెటిజన్లు ప్రశంసించారు.

4

మనవరాలి భవిష్యత్తు కోసం రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని సీపీ సజ్జనార్‌కు విజ్ఞప్తి.

ఐబొమ్మ రవి అరెస్ట్, నెటిజన్ల ప్రశంసలు

సినిమాలను పైరసీ చేస్తూ పోలీసులతో పాటు చిత్రపరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రవి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.  ఈక్రమంలోనే నటుడు శివాజీ కూడా అతని నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్‌ చేశాడు. కానీ , ఆయన తండ్రి అప్పారావు కుమారుడి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.

కుమారుడి తప్పు ఒప్పుకున్న తండ్రి అప్పారావు

తన కుమారుడు రవి తప్పు చేశాడని అప్పారావు అంగీకరించారు. రవి తనను కలిసి రెండేళ్లకు పైగానే అవుతుందన్నారు. చట్ట ప్రకారం రవిని శిక్షించాలని కూడా అప్పారావు చెప్పడం విశేషం. రవి తనకు కుమారుడు అయినప్పటికీ చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియని ఎలా తప్పుబడుతానని మీడియాతో చెబుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆపై సీపీ సజ్జనార్‌కు రిక్వెస్ట్‌గా  ఇలా చెప్పాడు.

సజ్జనార్‌ సార్‌కు అప్పారావు కన్నీటి విన్నపం

‘సజ్జనార్‌ సార్‌ మా మీద దయతలచి స్టేషన్‌లో వాడిని ఇబ్బంది పెట్టకండి. కానీ, మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు. వాడికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు దానిని తలుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తుంది. నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి. కోడలు కూడా నాతో మాట్లాడదు. కానీ, నా మనవరాలు చాలా తెలివైనది. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే. మా కన్నీళ్లు చూసి సజ్జనార్‌ సార్‌కు జాలీ కలిగినా సరే చట్టం అనేది ఉంది కాబట్టి ఆయన కూడా  నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి రవిని వదిలేయలేరు కదా.? అందుకు చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ, కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు. ‘అంటూ అప్పారావు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు కుమారుడి అరెస్ట్‌పై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మనవరాలి భవిష్యత్తు కోసం రవికి తక్కువ శిక్ష కోరుతూ సజ్జనార్‌ను కన్నీళ్లతో వేడుకున్నారు. ఈ సంఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.