|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naa Telugodu : హరినాథ్ పోలిచర్ల నా తెలుగోడు.. రిలీజ్ డేట్ అనౌన్స్..

Published: 18-11-2025, 11:36 AM
Naa Telugodu : హరినాథ్ పోలిచర్ల నా తెలుగోడు.. రిలీజ్ డేట్ అనౌన్స్..

హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో రూపొందిన ‘నా తెలుగోడు’ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విశేషాలను చిత్ర బృందం మీడియాతో పంచుకుంది.

Key Points

1

హరినాథ్ పోలిచర్ల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'నా తెలుగోడు' డిసెంబర్ 12న విడుదల.

2

తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

4

ఈ చిత్రం హిందీలో 'RK' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.

‘నా తెలుగోడు’ చిత్ర విడుదల తేదీ ఖరారు

Naa Telugodu : హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై హరినాథ్ పోలిచర్ల హీరోగా తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘నా తెలుగోడు’.  రిలీజ్ డేట్ ప్రకటిస్తూ హరినాథ్ పోలిచర్ల నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాని డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.(Naa Telugodu)

దర్శకుడు హరినాథ్ పోలిచర్ల మాటలు

హరినాథ్ పోలిచర్ల మాట్లాడుతూ.. నా తెలుగోడు సినిమా షూటింగ్, సెన్సార్ పూర్తిచేసుకుని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది. ఒక సైనికుడు దేశం కోసం జీవితం త్యాగం చేయడం, ఆడపిల్లలను కాపాడటంపై, డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడటం అనే పలు అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాము. ఎన్టీఆర్ గారి ప్రేరణతోనే ఈ టైటిల్ పెట్టాను. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు గోవా, మునార్, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో షూట్ చేసాము. నేను డాక్టర్ అయినా యాక్టింగ్ – డాక్టర్ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ సినిమాను హిందీలో RK పేరిట రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాలో మా అమ్మ పాత్రను నిజంగా మా అమ్మ నుండి ప్రేరణగా తీసుకొని రాశాను అని అన్నారు.

సినిమా కథాంశం, కీలక పాత్రలు

సైనికుడు, దేశభక్తి, సమాజ సేవ వంటి పలు అంశాలతో తెరకెక్కిన “నా తెలుగోడు” సినిమాపై హరినాథ్ పోలిచర్ల ఆశలు పెట్టుకున్నారు. హిందీలో కూడా విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.