|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (మే 10, 2025): ఆదాయవృద్ధి, కొత్త కొనుగోళ్లు, శివారాధన

Published: 09-05-2025, 6:44 PM
నేటి రాశి ఫలాలు (మే 10, 2025): ఆదాయవృద్ధి, కొత్త కొనుగోళ్లు, శివారాధన

మే 10, 2025 నాటి రాశి ఫలాల్లో, అనేక రాశులకు ఆదాయం పెరుగుతుందని, కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని, మరియు కొన్ని దేవతల ఆరాధన శుభప్రదం అని తెలుస్తుంది.

Key Points

1

మేష, వృషభ, కర్కాటక రాశుల వారికి ఆదాయ వృద్ధి.

2

కొత్త వస్తువుల కొనుగోలుకు అనుకూల సమయం.

4

వివాహాది శుభకార్యాలకు అనుకూలం.

వివిధ రాశులకు ఆర్థిక పరిస్థితులు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : శనివారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : చిత్త

మేష రాశి వారు సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.

వృషభ రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాయి బాబా ఆలయాన్ని సందర్శించండి.

శుభకార్యాలకు అనుకూలత

ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. చెల్లింపుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులకు హాజరవుతారు, గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అధికారులతో ఉత్సాహంగా ఉంటూ. పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

సింహ రాశి వారికి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనులలో జాప్యం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు, కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. ఇష్టదైవరాధన చేసుకోండి.

తుల రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రామాలయాన్ని సందర్శించండి.

దేవతారాధన సూచనలు

వృశ్చిక రాశి పిల్లలు చదువులో రాణిస్తారు. పైచదువులకు అను కూలం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయా ణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రైతులకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ చూపుతారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మకర రాశి వారు ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. కోర్టు కేసులలో అను కూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో చిన్న పాటి మనస్పర్థలు రావచ్చు. గోమాత సేవ చేసుకోండి.

కుంభ రాశి వారు ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్త వుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమా లకు హాజరవుతారు. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. శివారాధన శుభప్రదం.

ఈ రోజు అనేక రాశులకు ఆర్థికంగా, సామాజికంగా అనుకూలంగా ఉంది. శివ, సాయి, గణపతి, దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.