
జూలై 22, 2025 నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి రాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో, ఏ విషయాలపై జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం. శ్రీమహాలక్ష్మి పూజా సూచనలు కూడా ఇవ్వబడ్డాయి.
Key Points
మేష, వృషభ, మిథున రాశులకు శుభ ఫలితాలు.
కర్కాటక, సింహ, కన్య రాశులకు విజయాలు, కానీ జాగ్రత్త అవసరం.
తుల రాశికి అదృష్టం, కానీ వివాదాలకు దూరంగా ఉండాలి.
శ్రీమహాలక్ష్మి పూజతో శుభ ఫలితాలు పొందవచ్చు.
వివిధ రాశులకు ఫలాలు
రాశిఫలాలు (దిన ఫలాలు) : 22.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : కృ. ద్వాదశి/త్రయోదశి, నక్షత్రం : మృగశిర
మేష రాశి వారు విజయాలు సాధిస్తారు. ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. సృజనాత్మకమైన ఆలోచనలతో సమస్యల్ని సులువుగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. రెండో రాశిలో ఉన్న శుక్రుడు ఆర్థిక ప్రయోజనాల్ని కల్పిస్తాడు. కనకధారాస్తవం పారాయణం చేయండి.
వృషభ రాశి వారికి లక్ష్మీయోగం శుభప్రదం. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తులో రుణ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధిబలంతో ఒత్తిళ్లను అధిగమించండి. ఆత్మీయులు, సహోద్యోగుల విషయంలో అపార్థాలకు తావివ్వకండి. లక్ష్య సాధన పైనే దృష్టి నిలపండి. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. సూర్యదేవుడిని ధ్యానించండి.
మిథున రాశి వారికి ధనయోగం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతి ఆర్థిక నిర్ణయమూ లాభదాయకం అవుతుంది. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రేమపూర్వకంగా సంభాషించండి. ఎంతోకాలంగా ఆగిపోయిన పనులు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సాధనతో దైవబలాన్ని పెంచుకోండి. దత్తాత్రేయుడిని స్మరించండి.
శుభ ఫలితాల కోసం సూచనలు
కర్కాటక రాశి వారు మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఏకాదశంలోని శుక్రబలం అన్ని విధాలుగా రక్షిస్తుంది. సకాలంలో స్పందించడం ద్వారా లక్ష్య సాధనలో అడ్డంకులను అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో లోతైన ఆలోచన అవసరం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. నవగ్రహ ధ్యానశ్లోకాలు పఠించండి.
ఉద్యోగ ఫలితాలు బావుంటాయి. ఉన్నతస్థితి గోచరిస్తోంది. మీదైన ఆలోచనా విధానంతో పెద్దల్ని మెప్పిస్తారు. కీర్తి పెరుగుతుంది. మీ వల్ల స్నేహితులకు మేలు జరుగుతుంది. ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి. లేదంటే, బంధాలు దెబ్బతింటాయి. సరైన ప్రణాళికతో సవాళ్లను అధిగమిస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి.
కన్య రాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తారు. అధికార లాభం సూచితం. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. తోటివారి ఆదరాభిమానాలను సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీమహాలక్ష్మిని పూజించండి.
తుల రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు మంచికాలం. మీ ధైర్యమే మీ పెట్టుబడి. ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. దైవబలం సదా నడిపిస్తుంది. మొహమాటం వల్ల తెలియని ఖర్చులు ఎదురవుతాయి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకండి. వ్యాపారం మీద మరింత దృష్టి పెట్టండి. ఓ శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మహాలక్ష్మిని ధ్యానించండి.
వృశ్చిక రాశి వారు మనోబలాన్ని పెంచుకోండి. లక్ష్యాన్ని సాధించేవరకు ప్రయత్నాన్ని ఆపకండి. చంచలత్వం వద్దు. ముఖ్య విషయాల్లో శ్రద్ధగా పనిచేయండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. అధికారులతో లౌక్యంగా వ్యవహరించండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
వివాదాలను నివారించడం
ధనుస్సు రాశి వారికి సమయపాలన అవసరం. ఎట్టిపరిస్థితుల్లోనూ పనులను వాయిదా వేయకండి. చెడును అతిగా ఊహించుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులతో జాగ్రత్త. మీరు నమ్మిన దర్శమే మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారంలో మెలకువతో వ్యవహరించాలి. ఒకట్రెండు అవరోధాలు ఎదురైనా నిరాశపడకండి. విజయం లభించే వరకు విశ్రమించకండి. నవగ్రహాలను ధ్యానించండి.
మకర రాశి వారికి శుభప్రదమైన కాలం. అనుకున్నది సాధిస్తారు. మేలు జరుగుతుంది. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. అధికారయోగం సూచితం. ఉన్నత స్థానాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. మహాలక్ష్మిని ఉపాసించండి.
వ్యాపారయోగం బావుంది. సరైన నిర్ణయాలతో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. పరిస్థితులకు తగినట్టు ప్రణాళికలు రచించుకోండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. ఇష్టదైవాన్ని పూజించండి.
మీన రాశి వారు ఏకాగ్రతతో కొత్త పనులను ప్రారంభించండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఫలితాల గురించి ఆలోచించకుండా మీ బాధ్యతలను నిర్వర్తించండి. కొందరు మీపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అయినా ప్రశాంతంగా సంభాషించండి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్యభగవానుడిని స్మరించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ఈ రోజు మీ రాశి ఫలాలను పరిశీలించి, సూచనలను పాటించడం ద్వారా సంతోషకరమైన రోజును గడపండి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉండనివ్వండి.


