
జూలై 24, 2025 నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుందో, అదృష్ట రంగులు, పూజలు, మరియు ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం.
Key Points
మేష రాశి వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాలలో మార్పులు.
వృషభ రాశి విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి.
మిధున రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం, కొత్త కాంట్రాక్టులు.
కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి, ఆస్తి వివాదాల పరిష్కారం.
ప్రతి రాశి ఫలాల సారాంశం
రాశి ఫలాలు (దిన ఫలాలు) : 24.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : కృ. అమావాస్య, నక్షత్రం : పునర్వసు
మేష రాశి వారు అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వృథా ఖర్చులు. తెలుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
వృషభ రాశి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. వ్యయప్రయాసలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మిధున రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.
అదృష్ట రంగులు మరియు పూజలు
కర్కాటక రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహ రాశి వారు అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. ధనవ్యయం, అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.
కన్య రాశి వారు వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. ఆరోగ్యభంగం, శ్రమ అధికం, బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాల కొనుగోలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. ధన వ్యయం, అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.
వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. అనారోగ్యం, కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత గులాబీ రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.
ముఖ్యమైన సూచనలు
ధనుస్సు రాశి వారి రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకర రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు నూతనోత్సాహం. ధనవ్యయం, మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభ రాశి వారు ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పై స్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, సన్మానాలు. ఆస్తి వివాదాలు, వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకోని ఖర్చులు. నీలం, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ఈ రాశి ఫలాలు సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. శుభం జరుగుగాక!


