
జూలై 31, 2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. మేష రాశి వారికి రాబడిపై దృష్టి పెట్టడం, శ్రీమతి సలహా పాటించడం ముఖ్యం. మిథున, కన్య రాశులకు శుభకాలం.
Key Points
జూలై 31, 2025 నాటి రాశిఫలాలను తెలుసుకోండి.
మేష రాశివారు రాబడిపై దృష్టి పెట్టాలి, శ్రీమతి సలహా పాటించాలి.
మిథున రాశివారికి అన్ని విధాలా అనుకూలం.
కన్య రాశివారికి విశేష కార్యసిద్ధి ఉంది.
మేష రాశి: రాబడిపై దృష్టి
రాశిఫలాలు (దిన ఫలాలు) : 31.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: శ్రావణ మాసం : గురువారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : చిత్త
మేష రాశి వారికి ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి.
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలు వదులుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు విపరీతం. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పత్రాల రిన్యూవల్లో జాప్యం తగదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి.
మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
మిథున, కన్య రాశులకు అనుకూలం
గృహస్థితి నిరాశాజనకం. సమయానుకూలంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. దృఢసంకల్పంతో శ్రమిస్తే గాని పనులు కావు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి.
సింహ రాశి వారికి వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
కన్య రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
వృశ్చిక రాశి వారు అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. ఇతరులను మీ దరికి చేరనీయవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత ముఖ్యం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.
ఇతర రాశుల ఫలాలు
ధనుస్సు రాశి వారికి కొంతమేరకు అనుకూలమే. కొన్ని సమస్యలు తొలగుతాయి. సమయస్ఫూర్తితో మెలగుతారు. పనులు సావకాశమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
మీ విజ్ఞతకు పరీక్షా సమయం. వ్యవహారంలో తొందరపాటు తగదు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం ఆశించి భంగ పడతారు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో మెలగండి. నోటీసులు అందుకుంటారు.
కుంభ రాశి వారి లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. చేపట్టిన కార్యం త్వరలో పూర్తవుతుంది. ఆశావహ దృక్పథంతో అడుగు ముందుకు వేయండి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ఆటంకాలు ఎదురైనా ఆందోళన చెందవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు.
మీన రాశి వారి మనోభీష్టం నెరవేరుతుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఉత్సాహంగా శ్రమించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు అధికం. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. పిల్లలకు శుభ పరిణామాలున్నాయి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలాలను అవగాహన చేసుకొని, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రమ, ఓర్పుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.


