|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (మే 19, 2025): శుభవార్త, భూ లావాదేవీల్లో లాభాలు!

Published: 18-05-2025, 6:44 PM
నేటి రాశి ఫలాలు (మే 19, 2025): శుభవార్త, భూ లావాదేవీల్లో లాభాలు!

మే 19, 2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో, భూ లావాదేవీలు, ఆరోగ్యం, మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

మేష రాశివారు శుభవార్త వినవచ్చు!

2

వృషభ రాశివారికి అదృష్ట యోగం!

4

కర్కాటక రాశివారికి పెట్టుబడులలో లాభాలు!

ప్రతి రాశి ఫలాల సారాంశం

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : సోమవారం, తిథి : సప్తమి: శ్రవణం

మేష రాశి వారు సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో చిన్నచిన్న కలహాలు ఉంటాయి. శుభవార్త వింటారు. విందు, వినోదాలకు హాజరవుతారు. శివారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అదృష్ట యోగం బలంగా ఉంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమయపాలన పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. పనుల్లో ఆటంకాలు తలె త్తుతాయి. మార్పు ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరు తుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఉద్యోగులకు పని పెరుగుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. సూర్యారాధన మేలు చేస్తుంది.

శుభకార్యాలకు అనుకూలమైన రాశులు

కర్కాటక రాశి వారు సమయస్ఫూర్తితో పనులు చేస్తే అన్నిటా విజయం వరిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలకంగా లాభాలు అందుకుంటారు, విందు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. పదోన్నతి, అనుకూల బదిలీకి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సాహసంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంయమనంతో వ్యవహరించండి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

రోజువారీ వ్యాపారం సాఫీగా సాగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారుల అనాదరణకు గురవు తారు. సహోద్యోగుల సహకారం ఆశించినప్పటికీ అంతగా దక్కక పోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితిలో అనుకూలమైన మార్పు వస్తుంది. పాతబాకీలు వసూలు అవు తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

తుల రాశి వారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. తీర్ధయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అన్న దమ్ముల సహకారం లభిస్తుంది. వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు తాత్కాలికంగా నెరవేరుతాయి. ఉద్యోగులు అందరి మన్ననలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. ఆర్ధికంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు

ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. పాలన పాటించడం అవసరం. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులకు మంచి సమయం. శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గా దేవి ఆరాధన మేలుచేస్తుంది.

మకర రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. శారీరక సమస్యలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నతవిద్య అనుకూలిస్తుంది. కొన్ని చికాకులు తలెత్తుతాయి. బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. శివారాధన శుభప్రదం.

రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. విహారయాత్రలు చేపడతారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. సహోద్యోగులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. పలుకుబడితో పనులు నెరవేరు తాయి. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. ఒక శుభవార్త వింటారు. భూ లావాదేవీల్లో ఆశించిన లాభాలు పొందుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించడం అవసరం. దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000

ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శుభదినం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.