
📌 Key Points
- నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్‌కు నభా నటేష్ పరిచయం.
- రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది.
- ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తున్న నభా.
- ట్రెడిషనల్ లుక్‌లో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నభా నటేష్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆమె అందమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దేవకన్య దిగివచ్చిందా అన్నట్లు ఆమె అందం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నభా నటేష్ సినీ ప్రస్థానం
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసిన నభా
అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
నెట్టింట నభా అందాల విందు: నెటిజన్ల కామెంట్స్
అందులో మెరూన్ కలర డ్రెస్సులో ట్రెడిషనల్‌గా రెడీ అయింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు, పాపిట బిళ్ళ పెట్టుకొని మంచిగా కనిపించింది. ఇక వీటికి.. ‘నా ఇంటి వెనుక ప్రాంగణం నుండి కొన్ని సౌందర్యాలను మీ ఫీడ్ కు తీసుకువస్తున్నాను’ అని రాసుకొస్తూ హార్ట్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు భువినుంచి దిగివచ్చిన దేవకన్య నా.. అప్సరస నా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ భామ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.
నభా నటేష్ ట్రెడిషనల్ లుక్ అందరినీ ఎంతగానో మైమరపిస్తోంది. దేవకన్యను తలపించే ఆమె అందం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలతో నభా తన అందంతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది.


