
📌 Key Points
- నాగ చైతన్య, శోభిత డిసెంబర్ లో వివాహం చేసుకుని, రీసెంట్ గా మొదటి పెళ్లి రోజు జరుపుకున్నారు.
- నవీన్ పొలిశెట్టి ‘పొలిశెట్టి మీట్స్ పికిల్ బాల్’ ఈవెంట్‌కు నాగ చైతన్య, శోభిత జంటగా హాజరయ్యారు.
- నవీన్ ‘చై’ అని పిలవగా, తన భర్తను ‘చైతూ’ అని పిలవాలని శోభిత నొక్కి చెప్పడం వైరల్ అయింది.
- సమంత గతంలో నాగ చైతన్యను ‘చై’ అని పిలిచే నేపథ్యంలో శోభిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభితను వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా మొదటి పెళ్లి రోజు జరుపుకున్న ఈ జంట, నవీన్ పొలిశెట్టి ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ నాగ చైతన్యను ‘చై’ అని పిలవొద్దని, ‘చైతూ’ అని పిలవాలని శోభిత చెప్పడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత మొదటి వార్షికోత్సవం
సమంత తో విడాకుల తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య గతేడాది డిసెంబర్ లో శోభితను వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా మొదటి పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న ఈ జోడి.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. వీరిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. మొదట్లో వీరి జోడిపై విమర్శలు వచ్చినా… ఇప్పుడు మాత్రం వీరి జోడి చూడటానికి చాలా బాగుంది అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.
రీసెంట్ గా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి… ‘ పొలిశెట్టి మీట్స్ పికిల్ బాల్’ అనే కార్యక్రమం నిర్వహించారు. తన సినిమా ‘అనగనగా ఒక రాజు’ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ కార్యక్రమానికి నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి రావడం విశేషం.
నవీన్ పొలిశెట్టి ఈవెంట్‌లో వైరల్ అయిన ఘటన
కాగా.. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ‘అనగనగా ఒక రాజు’ మూవీలోని ‘ భీమవరం బాలుమా.. భాగా బీచ్ పోదమా’ అనే పాటకు స్టెప్స్ వేయమని.. నవీన్.. నాగచైతన్యని పిలిచాడు. అయితే…. ఆ సమయంలో నాగ చైతన్యను.. ‘చై’ అని పిలవడం శోభితకు నచ్చకపోవడం గమనార్హం. నవీన్.. ‘చై’ అని పిలిచిన ప్రతిసారీ… అలా పిలవొద్దని… ‘చై కాదు.. చైతూ’ అని చెప్పారు. చైతూ అని పిలవమని ఆమె నొక్కి నొక్కి మరీ ఎక్కువసార్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘చై’ వద్దు, ‘చైతూ’ ముద్దు: శోభిత ఎందుకు చెప్పింది?
గతంలో సమంత…నాగ చైతన్యను ‘చై’ అని పిలిచేది. వీరిద్దరి జోడిని కలిపి ‘చై, సామ్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవాళ్లు. వాళ్లిద్దరూ విడిపోయినా కూడా.. ఇంకా అలానే పిలవడం శోభితకు నచ్చినట్లు లేదు. అందుకే… చైతూ అని పిలవమని చెప్పిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.
ఈ ఘటన నాగ చైతన్య, సమంత గత సంబంధాన్ని, శోభిత వ్యక్తిగత ప్రాధాన్యతలను స్పష్టం చేసింది. అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసిన ఈ సంఘటన, సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని పెంచింది.


