
ముంబైలో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో టాలీవుడ్ నటుడు నాగచైతన్య మరియు నటి శోభిత ధూళిపాళ పాల్గొన్నారు. వారి జంట అందరినీ ఆకట్టుకుంది.
Key Points
వేవ్స్ సమ్మిట్ లో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ సందడి.
నాగచైతన్య బ్లాక్ సూట్ లో, శోభిత చీరలో అందంగా కనిపించారు.
సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య తాజా చిత్రం 'తండేల్' బ్లాక్ బస్టర్ హిట్.
వేవ్స్ సమ్మిట్ వేడుకలు
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేడుకలు ముంబై వేదికగా జీయో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ వేడుకలను భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు భారత ప్రభుత్వం ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మలయాళ హీరోలు, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజినీకాంత్(Rajinikanth), చిరంజీవి(Chiranjeevi), మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు.
అయితే ఇందులో టాలీవుడ్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ కూడా పాల్గొన్నారు. ఇందులో బ్లాక్ కలర్ సూటు బూటులో నాగచైతన్య(Naga Chaitanya) కనిపించగా.. శోభిత(Sobhita Dhulipala ) చీరకట్టుతో సంప్రదాయంగా నుదుటిన బొట్టు పెట్టుకుని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్‌గా ఉన్నారని అంటున్నారు. కాగా, నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘తండేల్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పెళ్లి తర్వాత మొదటి హిట్‌తో బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో అదే ఫామ్ నాగచైతన్య వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఆయన ‘NC-24’మూవీని చేస్తున్నారు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
నాగచైతన్య మరియు శోభిత లుక్
సోషల్ మీడియాలో వైరల్
ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో నాగచైతన్య మరియు శోభిత జంట అందరి దృష్టిని ఆకర్షించారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగచైతన్య కెరీర్ కూడా శిఖరాలను చేరుకుంటోంది.


