|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naga Chaitanya: మై లేడీ అంటూ ఆ హీరోయిన్‌కు విష్ చేసిన నాగచైతన్య.. సమంతకు ఎప్పుడైనా ఇలా విష్ చేశావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

Published: 31-05-2025, 9:52 AM
Naga Chaitanya: మై లేడీ అంటూ ఆ హీరోయిన్‌కు విష్ చేసిన నాగచైతన్య.. సమంతకు ఎప్పుడైనా ఇలా విష్ చేశావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

నాగచైతన్య తన భార్య శోభిత దూళిపాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మై లేడీ’ అంటూ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. సమంత అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

Key Points

1

నాగచైతన్య శోభితకు 'మై లేడీ' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4

చైతన్యపై విమర్శలు, తిట్లు వర్షిస్తున్నాయి.

నాగచైతన్య – శోభిత దూళిపాల పుట్టినరోజు విషెస్

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘జోష్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సమయంలోనే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు. డైవర్స్ తర్వాత సమంత(Samantha) మయోసైటీస్ బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఈ నేపథ్యంలోనే.. నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూనే యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ(Sobhita Dhulipala )తో సీక్రెట్‌గా డేటింగ్ చేశారు. కొద్ది కాలానికి పెద్దలను ఒప్పించి నాగార్జున(Nagarjuna) సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

ఇక గతఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట నిత్యం పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే..చైతు ‘తండేల్’తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘NC-24’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక శోభిత మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇదిలా ఉంటే… తాజాగా, శోభిత పుట్టినరోజు కావడంతో నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతూ మై లేడీ అని పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సమంతకు ఇలా విష్ చేసావా.. నీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దారుణంగా నాగచైతన్యను తిడుతున్నారు. అసలు ఎంతమంది మోసం చేస్తావని దుమ్మెత్తిపోస్తున్నారు.

సమంత అభిమానుల విమర్శలు

A post shared by Chay Akkineni (@chayakkineni)

నాగచైతన్య, శోభిత దూళిపాలకు చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సమంత అభిమానుల ప్రతిస్పందనలు విభిన్నంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.