
📌 Key Points
- నాగబాబు చిన్నారి శ్రీ హర్ష వైద్యానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
- శ్రీ హర్ష గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- గత కొద్ది రోజులుగా శ్రీ హర్ష గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.
- నాగబాబు సహాయం చేయడమే కాకుండా, అందరూ సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
మెగా కుటుంబం ఎప్పుడూ సేవా కార్యక్రమాలలో ముందుంటుంది. తాజాగా నాగబాబు ఒక చిన్నారికి ఆర్థిక సహాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
గుండె సంబంధిత వ్యాధితో శ్రీ హర్ష
Nagababu: సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోలుగా, నిర్మాతలుగా మెగా కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక మెగా హీరోలలో నాగబాబు కూడా ఒకరు. ఈయన నిర్మాతగా నటుడుగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులు నటించారు. అయితే ఇటీవల కాలంలో సినిమాలను తగ్గించిన నాగబాబు రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నారు. ఈయన ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు వారి వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.
ఇప్పటికే ఉపాసన రాంచరణ్ చిరంజీవి లాంటి వాళ్ళు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు ఇక తాజాగా నాగబాబు సైతం చిన్నారికి ఆర్థిక సహాయం అందజేస్తూ తన మంచి మనసును చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కట్ట శ్రీ హర్ష అనే చిన్నారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు శ్రీ హర్ష ప్రస్తుతం కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నాగబాబు విచారం వ్యక్తం చేశారు.
శ్రీ హర్ష ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే నాగబాబు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా శ్రీహర్ష తండ్రికి ధైర్యం చెబుతూ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య చికిత్స నిమిత్తం కావాల్సిన డబ్బును సమకూర్చాలని ఉన్నవారు చేతనయినంతలో సహాయం అందించాలని నాగబాబు పిలుపు నిచ్చారు. శ్రీ హర్ష గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు గుండె నుంచి రక్తం పది శాతం మాత్రమే పంపింగ్ అవడంతో చిన్నారి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ చిన్నారి ఆరోగ్యం కోసం 13 లక్షల వరకు ఖర్చు అయ్యాయని ఇంకా పది లక్షల వరకు డబ్బు అవసరమవుతుందని ఆసుపత్రి నిర్వాహకులు తెలియజేశారు.
ఆర్థిక సహాయం అందించిన నాగబాబు
గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న కట్టా శ్రీహర్ష (3సంవత్సరాలు) వైద్యఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం సోమవారం హైదరాబాద్ లో అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం… pic.twitter.com/mcfZCUvkLe
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 23, 2026
సహాయం చేయాలని నాగబాబు పిలుపు
ఈ నేపథ్యంలోనే చిన్నారి చికిత్సకు అవసరమై సహాయం చేయాలనుకునేవారు చేయాలి అంటూ చిన్నారి తండ్రికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ను నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా నాగబాబు చిన్నారికి అండగా నిలబడమే కాకుండా అవసరమైన వారు మరింత సహాయం చేసి చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ ఈయన పోస్ట్ చేయడంతో పలువురు సానుకూలంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సినిమాలో బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ, తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపైనే ఉంచారు. అలాగే జనసేన పార్టీ వ్యవహారాలను కూడా చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
నాగబాబు చేసిన ఈ సహాయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. చిన్నారి త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుందాం.


