|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagababu: విడాకులు అనగానే ఓకే చెప్పా.. కలిపేందుకు ప్రయత్నించలేదు.. రెండో పెళ్లి!

Published: 22-06-2025, 2:41 AM
Nagababu: విడాకులు అనగానే ఓకే చెప్పా.. కలిపేందుకు ప్రయత్నించలేదు.. రెండో పెళ్లి!

నిహారిక చైతన్య విడాకులపై నాగబాబు తన అభిప్రాయాలను వెల్లడించారు. పరస్పర అంగీకారంతో విడాకులు జరిగాయని, తాను ఎటువంటి జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఈ విషయంపై ఆయన ఇచ్చిన స్పందన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Key Points

1

నాగబాబు నిహారిక విడాకులపై స్పందించారు.

2

నిహారిక, చైతన్య విడాకులు పరస్పర అంగీకారంతో జరిగాయి.

4

నిహారిక త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నిహారిక విడాకులపై నాగబాబు స్పందన

కష్టాలు లేని జీవితం ఉండదు. మెగా డాటర్‌ నిహారిక లైఫ్‌లోనూ కష్టాలున్నాయి. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. కానీ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి. నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు, దూరం, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2023లో నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు.

ఆ ఒక్కటే అవసరం తాజాగా ఈ విషయం గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నిహారిక, నేను ఎక్కువ మాట్లాడుకుంటాం. పిల్లల కెరీర్‌ విషయాల్లో నేను తలదూర్చను. నా పిల్లల హిట్స్‌, ఫ్లాప్‌ గురించి నాకవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృథానే! వరుణ్‌.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా? అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటాం అని బదులిచ్చాడు. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

పరస్పర అంగీకారంతో విడాకులు

తప్పు నాదే కానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్‌ తప్పయింది. ఆ పెళ్లి మేం చేసిన తప్పు. మేం సరిగా జడ్జిమెంట్‌ చేయలేకపోయాం. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్లాం. కానీ.. తనకు, అబ్బాయికి సింక్‌ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారిద్దరూ కలిసుండేందుకు నేనెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇష్టం లేదన్నారు, సరేనని చెప్పాను. ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు చేస్తోంది. కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.

నాగబాబు జడ్జిమెంట్ తప్పు

నిహారిక భవిష్యత్తులో సంతోషంగా ఉంటుందని నాగబాబు ఆశిస్తున్నారు. ఆమె మంచి భాగస్వామిని కనుగొని సంతోషకరమైన జీవితం గడుపుతుందని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.