
📌 Key Points
- భరణి బిగ్ బాస్ హౌస్ నుండి గ్రాండ్ ఫినాలే ముందు రెండోసారి ఎలిమినేట్ అయ్యారు.
- నాగబాబు సిఫార్సుతో భరణి హౌస్‌లోకి మళ్ళీ ప్రవేశించారు.
- వారానికి రూ. 3.5 లక్షల చొప్పున మొత్తం రూ. 45 లక్షల భారీ పారితోషికం అందుకున్నారు.
- బిగ్ బాస్ విజేత కంటే ఎక్కువ సంపాదించి, ‘అన్ అఫీషియల్ విన్నర్’గా పేరు పొందారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భరణి ఎలిమినేషన్, రీ-ఎంట్రీ ఆసక్తి రేపాయి. నాగబాబు సిఫార్సుతో హౌస్‌లోకి తిరిగి వచ్చిన భరణి, వారానికి రూ. 3.5 లక్షల భారీ పారితోషికంతో బిగ్ బాస్ విజేత కంటే ఎక్కువ సంపాదించి ‘అన్ అఫీషియల్ విన్నర్’గా నిలిచారు.
భరణి అనూహ్య ఎలిమినేషన్, రీ-ఎంట్రీ వెనుక కథ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో చివరి దశకు చేరుకుంది. టాప్ 5 ఎవరో కూడా ప్రకటించేశారు. ముందు నుంచి వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లుగానే టాప్ 5 లిస్ట్ ఉంది. కాకపోతే భరణి టాప్ 5 లో ఉంటారు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇదొక్కటే చిన్న సర్ప్రైజ్. తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమాన్ పవన్, సంజన టాప్ 5 గా నిలిచారు. తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్ళు టాప్ 5 లో ఉంటారని ముందు నుంచి ఊహించినదే.
కాగా సండే ఎపిసోడ్ లో అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. భరణి ఈ సీజన్ లో ఎలిమినేట్ కావడం ఇది రెండవసారి. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రధాన కంటెస్టెంట్స్ లలో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన భరణి 6 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబుకు భరణి బాగా క్లోజ్. దీనితో నాగబాబు రెకమండేషన్ తో ఒక పథకం ప్రకారం భరణిని మళ్ళీ హౌస్ లోకి తీసుకువచ్చారు. ఈ ప్రాసెస్ లో దమ్ము శ్రీజని బలిపశువుని చేశారు.
నాగబాబు సపోర్ట్‌తో భారీ పారితోషికం
అలా రెండవసారి హౌస్ లోకి వచ్చిన భరణి గ్రాండ్ ఫినాలే వీక్ కి ముందు ఎలిమినేట్ కావడం విశేషం. భరణి తెలుగు బుల్లితెరపై డిమాండ్ ఉన్న సీనియర్ యాక్టర్. పైగా నాగబాబు సపోర్ట్ ఉంది. దీనితో భరణికి బిగ్ బాస్ నిర్వాహకులు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారు. సీజన్ 9లోనే భరణికి హైయెస్ట్ రెమ్యునరేషన్ అందింది. భరణికి వారానికి 3.5 లక్షలు పారితోషికం ముట్టింది.
హౌస్ లో భరణి మొత్తం దాదాపు 13 వారాలు ఉన్నారు. ఈ లెక్కన భారానికి రూ. 45 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ విజేతకి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ 50 లక్షలలో చాలా లెక్కలు ఉంటాయి. కానీ భరణి కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే 45 లక్షలు అందుకోవడంతో.. బిగ్ బాస్ సీజన్ 9కి అతడు అన్ అఫీషియల్ విన్నర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు రెకమండేషన్ భరణికి బాగా ఉపయోగపడింది అని అంటున్నారు.
విజేత కన్నా ఎక్కువ: ‘అన్ అఫీషియల్ విన్నర్’గా భరణి
భరణి బిగ్ బాస్ తెలుగు 9లో బంధాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. తనూజ భరణిని తండ్రిగా భావించింది. దీనితో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. భరణి ఎలిమినేట్ అయ్యాక తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. భరణికి దివ్యతో కూడా బాండింగ్ ఏర్పడింది. మొత్తంగా భరణి బిగ్ బాస్ హౌస్ లో తన స్థాయిలో అలరించడానికి ప్రయత్నించారు.
బిగ్ బాస్ సీజన్ 9లో భరణి ప్రయాణం నాగబాబు మద్దతు, భారీ రెమ్యునరేషన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. విజేత టైటిల్ గెలవకపోయినా, గణనీయమైన ఆర్థిక లాభంతో ‘అన్ అఫీషియల్ విన్నర్’గా తనదైన ముద్ర వేశాడు.


