|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్ మూవీ సెన్సేషన్: 100వ సినిమాలో టబు ఫిక్స్! నాగ్ సీక్రెట్స్ రివీల్!

Published: 28-01-2026, 4:35 AM
కింగ్ మూవీ సెన్సేషన్: 100వ సినిమాలో టబు ఫిక్స్! నాగ్ సీక్రెట్స్ రివీల్!
  • నాగార్జున 100వ సినిమాలో టబు నటిస్తుందనే వార్తలపై స్పందించిన నాగార్జున.
  • తన కెరీర్ ప్రారంభం నుంచి టబు తనకు తెలుసని తెలిపిన నాగార్జున.
  • వందవ సినిమాలో భాగం కావాలని టబు కోరుకుంటున్నట్లు వెల్లడి.
  • మరోసారి వెండితెరపై నిన్నే పెళ్లాడుతా జోడి సందడి చేయనున్నారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ సినిమాలో టబు నటిస్తుందనే వార్తలపై స్పందించారు. టబు ఈ ప్రాజెక్టులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున 100వ సినిమా విశేషాలు

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నాగార్జున (Nagarjuna)తన కెరీర్ లో ఇప్పటివరకు 99 సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే ఈయన100 వ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయి. నాగార్జున సినీ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకుడుగా మారబోతున్నారని, లాటరీ కింగ్ (Lottery King)అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు గత కొద్దిరోజులుగా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం బయటకు రాలేదు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటిస్తున్నారంటూ కూడా వార్తలు బలంగా వినిపించాయి. అనుష్కతో పాటు నాగార్జున లక్కీ చార్మ్, సీనియర్ నటి టబు(Tabu) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున టబు జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిసింద్రి, నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే సూపర్ డూపర్ కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున కెరియర్ లో కీలకంగా మారిన 100వ సినిమాలో ఈమె నటించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి తెరపై ఈ జంటను చూడటానికి అభిమానులు కూడా ఆత్రుత కనబరుస్తున్నారు.

టబుతో నాగార్జున అనుబంధం

ఇలా టబు నాగార్జున సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్న ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో నాగార్జున మాట్లాడుతూ.. టబు నా కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి నాకు బాగా తెలుసు .అయితే నా వందవ సినిమా గురించి తెలియగానే టబు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు అంటూ నాగార్జున తెలియజేశారు. ఇలా నాగార్జున చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాలో టబు కూడా నటించబోతున్నారని స్పష్టమవుతుంది.

ఇలా మరోసారి వెండితెరపై నిన్నే పెళ్ళాడుతా వంటి సూపర్ క్లాసిక్ జోడి సందడి చేయబోతున్నారనే విషయం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా నాగార్జున సినీ కెరియర్ లోనే ఎంతో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నాగార్జున ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే విషయాల పట్ల స్పష్టత రావాల్సి ఉంది.

సినిమాపై నాగార్జున ప్రకటన

మొత్తానికి నాగార్జున, టబు కలిసి నటించే అవకాశం ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.