|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akkineni Nagarjuna: కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సర్‌ప్రైజ్!

Published: 08-08-2025, 10:49 AM
Akkineni Nagarjuna: కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సర్‌ప్రైజ్!

అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 4K డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘కూలీ’ సినిమా రిలీజ్‌తో పాటు ఈ సర్‌ప్రైజ్ ప్రకటన అభిమానులను ఉత్సాహపరిచింది.

Key Points

1

నాగార్జున గారు 'శివ' సినిమాను 4K డాల్బీ అట్మాస్ సౌండ్ తో రీ-రిలీజ్ చేస్తున్నారు.

2

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన.

4

నాగార్జున అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్‌గా ఈ రిలీజ్ ప్లాన్.

‘శివ’ సినిమా రీ-రిలీజ్

అక్కినేని నాగార్జున – ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ ‌ బస్టర్ మూవీ శివ . 1990 లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ ‌ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది . ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు . తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు .

అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్ ‌ లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది . శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ‌ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి . అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ‌ ప్లాన్ ‌ తో వస్తున్నారు . సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది . మొట్ట మొదటిసారి అత్యాధునిక 4 కె డాల్బీ అట్మాస్ ‌ సౌండ్ ‌ తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ ‌ అభిమానులకు దక్కనుంది . ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు . అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ ‌ న్యూస్ చెప్పారు .

‘కూలీ’తో డబుల్ సర్‌ప్రైజ్

కూలీ థియేటర్లలో ట్రైలర్..

అన్నపూర్ణ స్టూడియోస్ వార్షికోత్సవం

అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ ‌ రోజే నాగార్జున్ ‌ ఈ బిగ్ ‌ సర్ ‌ ప్రైజ్ ‌ ప్లాన్ చేశారు . అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్ ‌ ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు . దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్ ‌ కు డబుల్ ‌ సర్ ‌ ప్రైజ్ ఇవ్వనున్నారు . శివ రీ రిలీజ్ ‌ డేట్ ‌ ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు . ఇది చూసిన డైరెక్టర్ ‌ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ ‌ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు .

అన్నపూర్ణ స్టూడియోస్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, అభిమానులకు ‘శివ’ సినిమా రీ-రిలీజ్‌తో నాగార్జున గారు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘కూలీ’ సినిమా రిలీజ్‌తో పాటు ‘శివ’ ట్రైలర్ ప్రదర్శన అభిమానులకు ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.