|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagarjuna: నన్ను ఎవరూ అడగలేదు.. క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున.. రూమర్స్ కి చెక్

Published: 14-02-2026, 9:05 PM
Nagarjuna: నన్ను ఎవరూ అడగలేదు.. క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున.. రూమర్స్ కి చెక్
  • కింగ్ నాగార్జున వందో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు – ఇది ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి!
  • బాలీవుడ్ ‘ధురంధర్’ సినిమాలో విలన్ పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదని నాగార్జున స్పష్టం చేశారు.
  • అక్షయ్ ఖన్నా నటన అద్భుతంగా ఉందని, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ఉరి’ కూడా తనకు నచ్చిందని నాగ్ తెలిపారు.
  • ‘ధురంధర్’ సీక్వెల్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని నాగార్జున అన్నారు.

కింగ్ నాగార్జున వందో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఆయన గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాలు చూద్దాం!

నాగార్జున వందో సినిమా విశేషాలు

Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం తన వందవ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. తన సినీ జీవితంలో చాలా ప్రత్యేకమైన ఈ వందవ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా నాగార్జున గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ సినిమాలో నాగార్జున(Nagarjuna) నటించాల్సింది అని.

‘ధురంధర్’ రూమర్స్ పై నాగ్ క్లారిటీ

ధురంధర్ సినిమాలో విలన్ గా అక్షయ్ ఖన్నా రెహమాన్‌ డెకాయిత్‌ అనే పాత్రలో కనిపించాడు. నిజానికి ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది ఆ పాత్ర. అయితే, ఆ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకున్నారని, కానీ ఆయన రజినీకాంత్ కూలీ సినిమా కోసం ధురంధర్ సినిమాను వదులుకున్నాడు అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యారు నాగార్జున ఆ పాత్ర చేస్తే బాగుండేది అని. అయితే, తాజాగా ఈ రూమర్స్ పై అక్కినేని నాగార్జున స్పందించాడు.

అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసలు

ఈ రూమర్స్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ధురంధర్ సినిమా విషయంలో నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ పాత్ర కోసం నన్ను ఎవరూ అడగలేదు. నిజానికి ‘ధురంధర్‌’ సినిమాలో అక్షయ్‌ఖన్నా యాక్టింగ్ సినిమాకే హైలైట్‌‌గా నిలిచింది. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఆదిత్య ధర్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన చేసిన ‘ఉరి’ సినిమా కూడా నాకు చాలా నచ్చింది. ధురంధర్ సీక్వెల్‌ కోసం అందరిలాగానే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.

నాగార్జున తాజా ప్రకటనతో ‘దురంధర్’ సినిమా గురించి వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. ఆయన వందో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.