|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్’ మూవీలో విలన్ రోల్ రిజెక్ట్ చేసిన నాగ్! అసలు నిజం వైరల్!

Published: 14-02-2026, 10:35 PM
షాకింగ్: 'ధురంధర్' మూవీలో విలన్ రోల్ రిజెక్ట్ చేసిన నాగ్! అసలు నిజం వైరల్!
  • కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం: ‘ధురంధర్’ మూవీలో విలన్ పాత్రకు నో చెప్పడానికి కారణమిదే!
  • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీలో అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో అద్భుత నటన కనబరిచారు.
  • నాగార్జున 100వ సినిమా కోసం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతికి భారీ ప్లానింగ్!
  • కింగ్ నాగ్ నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ‘ధురంధర్’ సినిమాలో విలన్ పాత్రను ఆయన రిజెక్ట్ చేశారనే వార్తలకు ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!

విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా ఇతర సినిమాల్లో కీలక, విలన్ పాత్రల్లో నటించడంపై చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. నాగ్ ఇప్పటికే బ్రహ్మాస్త్ర, కుబేర, కూలీ సినిమాల్లో నటించాడు. ఈ మూడు చిత్రాల్లోని నాగార్జున నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ హీరో తన 100వ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. తనకు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు రెండు విజయాలను అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ నటుడు తన 100వ సినిమా చేయనున్నాడు.

100వ సినిమాపై నాగ్ ఫోకస్!

ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తన నెక్స్ట్ చిత్రంపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన సమయంలో ఆయనకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన విడుదల అయిన ధురంధర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కన్నా విలన్ పాత్రలో నటించాడు. అక్షయ్ ఖన్నా పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.

‘ధురంధర్’ మూవీలో నిజమెంత?

ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ధురంధర్ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్ ఈ చిత్రంలో అక్షయ్ కన్నా పాత్రకు నాగార్జునను అనుకున్నట్లు, అందులో భాగంగా ఆయనను సంప్రదించగా కొన్ని కారణాలతో నాగార్జున ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అయ్యింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ… తనను దురంధర్ చిత్రంలో ఏ పాత్రకు సంప్రదించలేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని, ఏదేమైనా ధురంధర్ అద్భుతంగా ఉందని నాగార్జున తెలియజేశారు.

నాగార్జున ‘ధురంధర్’ మూవీ గురించి ఇచ్చిన క్లారిటీతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఆయన 100వ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.