
అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా, ఈ సినిమాలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్ కెరీర్‌కు మంచి హిట్ ఇవ్వాలని నాగార్జున ఆశిస్తున్నారని తెలుస్తోంది.
Key Points
అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’
నాగార్జున ‘లెనిన్’లో ప్రత్యేక పాత్రలో నటించే అవకాశం
ఈ న్యూస్‌కు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్
అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలని నాగార్జున ఆశ
లెనిన్ సినిమాపై అంచనాలు
అక్కినేని హీరో అఖిల్ (Akhil) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా.. అఖిల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క హిట్ కూడా పడకపోవడంతో అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే అఖిల్‌కు ఈ సినిమా ఓ మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్న అక్కినేని నాగార్జున.. తన కొడుకు కోసం ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా లెనిన్‌లో నాగార్జున్ ఓ శక్తివంతమైన పాత్రలో కనించనున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. ఈ సినిమాలో తన ప్రత్యేక పాత్రతో అఖిల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్‌కు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.
నాగార్జున ప్రత్యేక పాత్ర
వైరల్ ట్వీట్స్
నాగార్జున ‘లెనిన్’లో నటించడం నిజమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే, ఈ వార్త అఖిల్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


