|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగార్జునకు జాక్‌పాట్.. బిగ్ బాస్ 9 తెలుగు కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. గతేడాది కంటే 50 శాతం ఎక్కువ

Published: 11-08-2025, 2:14 AM
నాగార్జునకు జాక్‌పాట్.. బిగ్ బాస్ 9 తెలుగు కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. గతేడాది కంటే 50 శాతం ఎక్కువ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

Key Points

1

నాగార్జున బిగ్ బాస్ 9 తెలుగుకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

2

గతేడాది కంటే 50% ఎక్కువ రెమ్యునరేషన్.

4

సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ 9 తెలుగు ప్రసారం.

నాగార్జున రెమ్యునరేషన్ వివరాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. అంతకంటే ముందు ఈ సీజన్ లో తొలిసారి అగ్నిపరీక్ష పేరుతో 40 మంది సామాన్యుల నుంచి ముగ్గురిని ఎంపిక చేయబోతున్నారు. ఇది ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా రానున్న నాగార్జున.. రెమ్యునరేషన్ రూపంలో ఏకంగా రూ.30 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం.

వరుసగా బిగ్ బాస్ తెలుగు సీజన్లకు హోస్ట్ గా ఉంటూ వస్తున్నాడు అక్కినేని నాగార్జున . అలాగే ఈ సీజన్ కు కూడా అతడే ఫైనల్ అయ్యాడు. నిజానికి అతడు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో బాలకృష్ణను ఈసారి హోస్ట్ గా తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరికి రూ.30 కోట్ల డీల్ మాట్లాడి నాగార్జుననే ఫైనల్ చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

ఇది గతేడాది కంటే రూ.10 కోట్లు ఎక్కువ కావడం విశేషం. బిగ్ బాస్ 8 తెలుగు కోసం అతడు రూ.20 కోట్లు తీసుకున్నాడు. ఆ లెక్కన ఈ కొత్త సీజన్ కోసం 50 శాతం పెంచేసినట్లే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఓ తెలుగు రియాల్టీ షో కోసం ఇంత భారీ మొత్తం తీసుకోవడం మాత్రం నిజంగా మామూలు విషయం కాదు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందు ఆగస్టు 22 నుంచి బిస్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో హౌస్ లోకి సామాన్యుల ఎంట్రీ కోసం 40 మంది ఎంపిక చేసిన కంటెస్టెంట్లకు పరీక్ష పెట్టనున్నారు. దీనికి కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రముఖుల ఎంతో మంది రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈసారి కమెడియన్ ఇమాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ మానసలాంటి వాళ్లు కన్ఫమ్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. గతేడాది పెద్దగా పేరు తెలియని వాళ్లను హౌస్ లోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ సీజన్ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో ఈసారి సాధ్యమైనంత వరకు బాగా తెలిసిన పేర్లను తీసుకురావాలని నిర్ణయించారు.

బిగ్ బాస్ 9 ప్రారంభ తేదీ

బిగ్ బాస్ 9 తెలుగు ప్రోమో

ఇక తాజాగా స్టార్ మా బిగ్ బాస్ 9 తెలుగు కోసం సరికొత్త ప్రోమోను రిలీజ్ చేసింది. మరోసారి వెన్నెల కిశోర్ ను రంగంలోకి దింపింది. నాగార్జున, కిశోర్ తో చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్.. చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున ఈ ప్రోమోలో చెప్పడం చూస్తే.. కొత్తగా ఏం చేయబోతున్నారో అన్న ఆసక్తి నెలకొంది.

చివరగా, బిగ్ బాస్ తెలుగు 9 కోసం నాగార్జునకు లభించిన భారీ రెమ్యునరేషన్ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.