|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: దురంధర్‌లో విలన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టాలీవుడ్ కింగ్.. భారీ నష్టం!

Published: 19-01-2026, 2:00 AM
షాకింగ్: దురంధర్‌లో విలన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టాలీవుడ్ కింగ్.. భారీ నష్టం!
  • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ – ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు!
  • విలన్ పాత్ర కోసం మొదట నాగార్జునను సంప్రదించిన మూవీ మేకర్స్ – డేట్స్ కుదరకపోవడంతో మిస్ చేసుకున్న ఛాన్స్!
  • రెహమాన్ డకైట్ పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుత నటన – విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
  • కూలీ, కుబేర చిత్రాలతో బిజీగా ఉండడం వల్లే ‘ధురంధర్’ మూవీని వదులుకున్న నాగార్జున!

టాలీవుడ్ లో సంచలనం! బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం టాలీవుడ్ స్టార్ హీరోకి వచ్చి చేజారిపోయింది. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి!

నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar). ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వం వహించిన ఈ స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా(Akshay Khanna), సారా అర్జున్(Sara Arjun), ఆర్. మాధవన్(R.Madhavan), సంజయ్ దత్(Sanjay Dutt), అర్జున్ రాంపాల్(Arjun Rampaul) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది.

విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుత నటన

ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్‌కు ఎంత మంచి పేరొచ్చిందో విలన్‌గా అక్షయ్ ఖన్నాకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. రెహమాన్ డకైట్ పాత్రలో ఈ బాలీవుడ్ నటుడు ఒదిగిపోయాడని విమర్శకులు తెగ పొగిడేశారు. అయితే ధురంధర్ సినిమాలో విలన్‌గా అక్షయ్ ఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదట.

డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిన నాగ్

ఈ క్యారెక్టర్ కోసం మూవీ మేకర్స్ ముందుగా మన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునను సంప్రదించారట. నాగ్ కథ కూడా విని బాగా ఉందన్నారట. అయితే అప్పటికే అతను కూలీ, కుబేర చిత్రాల్లో బిజీగా ఉండడంతో ధురంధర్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. దీంతో ధురందర్ మేకర్స్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతుండగా.. అక్కినేని ఫ్యాన్స్ మంచి చాన్స్ మిస్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున గారు మిస్ చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.