|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: జగపతి బాబుని నాగార్జున పిలిచే ముద్దు పేరు లీక్! వైరల్ న్యూస్!

Published: 28-01-2026, 8:05 AM
  • జగపతి బాబును నాగార్జున ముద్దుగా ‘చౌ’ అని పిలుస్తారని తెలిపిన జగపతి బాబు.
  • చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరూ అలా పిలిచేవారని తెలిపిన జగపతి బాబు.
  • నాగార్జున, జగపతి బాబుల స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతోందని వెల్లడి.
  • అన్నయ్య రామ్ ప్రసాద్ ద్వారా నాగార్జునతో ఏర్పడిన స్నేహబంధం.

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలుగా పేరు తెచ్చుకున్న నాగార్జున, జగపతి బాబుల మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. వీరిద్దరి స్నేహం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జగపతి బాబును ‘చౌ’ అని పిలిచే నాగ్

టాలీవుడ్ స్టార్స్ నాగార్జున,జగపతి బాబులకు పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ.. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. నాగార్జున ఇప్పటికీ.. హీరోగా సినిమాలు చేస్తున్నారు. జగపతిబాబు మాత్రం.. తన సెకండ్ ఇన్నింగ్స్ రూట్ మార్చి.. విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కాగా.. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. కాగా, వీరు ఒకరినొకరు తమ పేర్లతో కాకుండా నిక్ నేమ్ తో పిలుచుకుంటారట. ఈ విషయాన్ని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో మధ్య పోటీ ఉంటుంది. వాళ్ల కోసం అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. కానీ, హీరోల మధ్య స్నేహం మాత్రం బాగానే ఉంటుంది.నాగార్జున, జగపతి బాబు కూడా తమ స్నేహాన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. తనను నాగార్జున ఎప్పుడూ ‘చౌ’ అని పిలుస్తారు అని జగపతి బాబు చెప్పారు. అయితే.. ‘చౌ’ అంటే.. చాలా మంది క్యాస్ట్ చౌదరి అనుకుంటారని…. కానీ కాదు అని ఆయన చెప్పారు.

దశాబ్దాల స్నేహబంధం వారిది

‘నాకు మా తాత గారు జగపతిరావు పేరు పెట్టారు. అయితే.. మా అమ్మ పేరు పెట్టి పిలవలేక.. ముద్దుగా చౌదరి అని పిలిచేది. ఇంట్లో అందరూ అలానే పిలిచేవారు. ఆ చౌదరి కాస్త.. ముద్దుగా ‘చౌ’లాగా మారిపోయిందని.. స్నేహితులు అందరూ తనను అలానే పిలుస్తారు.. నాగార్జున కూడా అలానే పిలుస్తారు’ అని జగపతి బాబు చెప్పారు.

షూటింగ్ లో మరింత బలపడిన స్నేహం

జగపతి బాబు అన్నయ్య రామ్ ప్రసాద్, నాగార్జున ప్రాణ స్నేహితులు. ఈ పరిచయమే నాగ్ , జగపతి బాబులను మరింత దగ్గర చేసింది.వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇక ఈ ఇద్దరూ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.హీరోగా ఒక దశ దాటాక, ఇద్దరూ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ధైర్యంగా ప్రారంభించారు. జగపతి బాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తుంటే, నాగ్ విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు.

జగపతి బాబు, నాగార్జునల స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.