|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ సినిమాలపై హైప్ ఎక్కిస్తున్న నాగవంశీ.. ఈ మాత్రం బూస్టప్‌ ఇస్తే చాలు రప్ఫాడించేస్తామంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Published: 30-06-2025, 5:46 AM

నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘కింగ్డమ్’ మరియు ‘హరిహర వీరమల్లు’ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ఆయన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

నాగవంశీ ట్విట్టర్‌లో 'కింగ్డమ్', 'హరిహర వీరమల్లు' సినిమాల గురించి అప్‌డేట్స్ ఇచ్చారు.

2

'కింగ్డమ్' సినిమా ఫుల్ మీల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని నాగవంశీ తెలిపారు.

4

నాగవంశీ అప్‌డేట్లకు ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో స్పందిస్తున్నారు.

నాగవంశీ ట్వీట్స్ వైరల్

నిర్మాత నాగ‌వంశీ(Naga Vamsi) ట్విట్ట‌ర్‌(Twitter)లో ఫుల్ బిజీ బిజీగా కనిపిస్తున్నారు. త‌న సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగవంశీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘కింగ్డమ్’(Kingdom) మూవీ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ట్విట్టర్‌లో ట్వీట్స్ పెట్టాడు.

‘కింగ్డమ్’ సినిమా అప్డేట్

కింగ్ డ‌మ్ గురించి ఓ ట్వీట్ చేస్తూ “నేను గట్టిగా న‌మ్మితే గానీ ఏదీ చెప్ప‌ను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద‌. కానీ ఈ సినిమా చూసి చెబుతున్నా.. ఫుల్ మీల్.. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. గౌత‌మ్ స్టైల్‌లో. త్వ‌ర‌లో అదిరిపోయే టీజ‌ర్, పాట‌తో క‌లుద్దాం” అంటూ ట్వీట్ చేశారు.

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్

అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ గురించి కూడా ఓ ట్వీట్ వేశారు నాగ‌వంశీ. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ట్రైల‌ర్ నాగ‌వంశీ చూసేశారు. అందుకే వీర‌మ‌ల్లు స‌ర్‌ప్రైజ్ చేస్తాడు.. ట్రైల‌ర్ త‌ర‌వాత ఈ సినిమా గురించి మ‌రింత మాట్లాడుకొంటారంటూ ఓ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్‌కి ఈ మాత్రం బూస్ట‌ప్ చాలు చెలరేగిపోమంటూ కామెంట్స్ చేస్తున్నారు. Links

నాగవంశీ ఇచ్చిన చిన్న అప్డేట్లకే ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. సినిమాల విజయానికి ఇది మంచి సంకేతం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.