|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు.. ఇంకా ఆ టైమ్ రాలేదు.. మరో పదేళ్లు ఉంది: ట్రోలర్స్‌కు నాగ వంశీ స్ట్రాంగ్ రిప్లై

Published: 20-08-2025, 4:42 PM
నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు.. ఇంకా ఆ టైమ్ రాలేదు.. మరో పదేళ్లు ఉంది: ట్రోలర్స్‌కు నాగ వంశీ స్ట్రాంగ్ రిప్లై

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రోలింగ్ కు ఆయన ఘాటుగానే స్పందించారు.

Key Points

1

వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.

2

నాగ వంశీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

4

మరో పదిహేనేళ్ళు సినిమా రంగంలో కొనసాగుతానని నాగ వంశీ ప్రకటన.

వార్ 2 బాక్సాఫీస్ ఫలితాలు

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకరు నాగ వంశీ. తెలుగులో ఇప్పటికే ఎన్నో హిట్స్ అందించాడు. అయితే తాజాగా అతడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన వార్ 2 మూవీ దారుణంగా బోల్తా పడటంతో అతనిపై కొన్ని రోజులుగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై బుధవారం (ఆగస్టు 20) అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు.

వార్ 2 మూవీ విషయంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు నాగ వంశీ సెటైరికల్ గానే అయినా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఆస్తులు అమ్ముకునే టైమ్ ఇంకా రాలేదని, మరో పది, పదిహేనేళ్లు ఉందంటూ అతడు ట్వీట్ చేశాడు. “ఏంటీ నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు.. వంశీ అది.. వంశీ ఇది.. అని గ్రిప్పింగ్ నెరేటివ్స్ తో ఫుల్ హడావిడి నడుస్తుంది..

సోషల్ మీడియాలో ట్రోలింగ్

పర్లేదు, ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. కానీ మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందకు క్షమించండి.. కానీ ఇంకా ఆ టైమ్ రాలేదు.. మినిమం ఇంకో పది, పదిహేనేళ్లు ఉంది. సినిమాకు దగ్గరగా, సినిమా కోసమే ఎప్పుడూ.. మా నెక్ట్స్ మూవీ మాస్ జాతరలో త్వరలోనే కలుద్దాం” అని నాగ వంశీ అన్నాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. పూర్తిగా నెగటివ్ రివ్యూలతో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న నాగ వంశీ.. హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ గురించి కాస్త ఎక్కువే మాట్లాడాడు.

నాగ వంశీ స్పందన

ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన అతడు.. ఈ సినిమాను మరో ఆలోచన లేకుండా చూడాలని, సినిమాలో అంత దమ్ము లేకపోతే తాను సాధారణంగా ఇలా చెప్పననీ అన్నాడు. ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే, ఓ మంచి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ మీకు కలగకపోతే ఇంకెప్పుడూ మైకు పట్టుకొని సినిమా చూడండని చెప్పను అని కూడా అన్నాడు.

అయితే మూవీ రిలీజైన తర్వాత తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో నాగవంశీకి భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ నష్టాలను పూడ్చడానికి అతడు ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ సోసల్ మీడయాలో ట్రోలింగ్ మొదలైంది. దీనిపై నాగవంశీ కూడా ఘాటుగానే స్పందించడంతో ఇది ఎక్కడి వరకూ వెళ్తుండో చూడాలి.

వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పటికీ, నాగ వంశీ తన సినిమా ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ట్రోలర్లకు సరైన సమాధానం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.