|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వార్‌ 2’పై ట్రోలింగ్‌.. నాగవంశీ మాస్‌ ట్వీట్‌

Published: 20-08-2025, 11:49 PM
‘వార్‌ 2’పై ట్రోలింగ్‌.. నాగవంశీ మాస్‌ ట్వీట్‌

సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనే నాగవంశీ, ‘వార్ 2’ చిత్రం విఫలం అవడంతో సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ట్రోలింగ్‌కు స్పందిస్తూ తన భవిష్యత్తు గురించి ప్రకటన చేశారు.

Key Points

1

నాగవంశీ నిర్మించిన ‘వార్ 2’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

2

సినిమా ఫలితాల తర్వాత నాగవంశీ సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారు.

4

ఇంకా 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని నాగవంశీ ప్రకటించారు.

వార్ 2 ఫలితాలు మరియు నాగవంశీ ప్రతిస్పందన

ఒక సినిమాని ప్రమోట్‌ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్‌ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్‌. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్‌ చేసిన క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది.

హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్‌ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చెప్పే విషయాలు , ఇచ్చే హైప్ ‌ మామలుగా ఉండదు . కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్ ‌ ఇచ్చి .. ట్రోలింగ్ ‌ కి కూడా గురవుతుండాడు . ఆయనే యంగ్ ‌ ప్రొడ్యూసర్ ‌ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ) .

సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరియు నాగవంశీ స్పందన

సితారఎంటర్ ‌ టైన్ ‌ మెంట్ ‌ బ్యానర్ ‌ పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ ‌ లో దూసుకెళ్తున్నాడు . మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి . ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి .

ఆయన బ్యానర్ ‌ నుంచి భారీ అంచనాలతో రిలీజైన ‘ కింగ్డమ్ ‌’ మూవీకి హిట్ ‌ టాక్ ‌ వచ్చినా .. కలెక్షన్స్ ‌ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది . ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్ ‌ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది . అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్ ‌ మీడియాలో యాక్టివ్ ‌ గా ఉండే వంశీ ​… వార్ ‌ 2 రిలీజ్ ‌ తర్వాత సైలెంట్ ‌ అయిపోయాడు . ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్‌ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి.

నాగవంశీ భవిష్యత్తు ప్రణాళికలు

అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు.  అంతేకాదు తనను ట్రోలింగ్‌ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు.

‘ ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ‘ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

‘వార్ 2’ వైఫల్యం తర్వాత నాగవంశీ సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. ట్రోలింగ్‌కు సమాధానమిస్తూ తన భవిష్యత్తు గురించి కూడా స్పష్టతనిచ్చారు. ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.