|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ దర్శకుడి తప్పే: కింగ్‌డమ్ ఫ్లాప్‌కు అసలు కారణం బయటపెట్టిన నాగవంశీ!

Published: 28-12-2025, 1:04 AM
ఆ దర్శకుడి తప్పే: కింగ్‌డమ్ ఫ్లాప్‌కు అసలు కారణం బయటపెట్టిన నాగవంశీ!
  • ‘కింగ్‌డమ్’ ఫ్లాప్‌పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.
  • దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ సీన్ విషయంలో వినలేదన్న నాగవంశీ.
  • సత్యదేవ్ పాత్ర తర్వాత వచ్చే సీనే సినిమా ఫ్లాప్‌కు ప్రధాన కారణమన్న నిర్మాత.
  • ఆ సీన్‌ను తొలగించమని చెప్పినా గౌతమ్ తిరస్కరించినట్లు నాగవంశీ వెల్లడి.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా భారీ అంచనాలకు తగ్గట్టు విజయం సాధించలేదు. ఈ సినిమా ఫ్లాప్‌కు అసలు కారణం ఏంటో నిర్మాత నాగవంశీ తాజాగా వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేసిన ఓ సీన్‌ వల్లే నెగెటివ్ టాక్ వచ్చిందని షాకింగ్ విషయాలు చెప్పాడు.

కింగ్‌డమ్ ఫ్లాప్‌కు నాగవంశీ కారణం ఏంటి?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా విమర్శలు వచ్చాయి. బడ్జెట్ పరంగా బాగానే ఖర్చు చేసినప్పటికీ లాభాలు మాత్రం రాలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ(Nagavamsi) ‘కింగ్‌డమ్’ ఫ్లాన్ అవడానికి కారణాలెంటో చెప్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఈ మూవీ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కొన్ని సీన్స్ విషయంలో దర్శకుడు గౌతమ్‌తో మాకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా సత్యదేవ పాత్ర చనిపొయే సన్నివేశం తర్వాత విజయ్

గౌతమ్ తిన్ననూరిపై నాగవంశీ ఆరోపణలు

మరో అమ్మాయితో పడుకున్నట్లుగా చూపించారు. ఆ సీన్‌ను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సీన్ తీసేయమని చెప్పినా నేను వేరే కోణంలో ఆలోచిస్తున్నా అని చెప్పి గౌతమ్ వినలేదు. ఆ సీన్‌కి బదులుగా.. మేము హీరోయిన్‌, విజయ్‌కి డ్రగ్ ఇచ్చి అతా చేసినట్లుగా చూపించమని చెప్పాను. అయినప్పటికీ దర్శకుడు వినిపించుకోకుండా.. అది అలాగే ఉంచేశారు. నేను ఆ సీన్ ‘కింగ్‌డమ్’ ఫ్లాప్ కావడానికి కారణం అని అనుకుంటున్నాను. ఆడియెన్స్ ఆ సీన్‌ను మరోలా అర్థం చేసుకోవడంతో.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నాగవంశీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కింగ్‌డమ్’ కథ పరంగా కనెక్ట్ అయినప్పటికీ కొన్ని సీన్స్ కారణంగానే తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుందని అంటున్నారు. దీని ఎఫెక్ట్ విజయ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారిపై బాగానే పడింది.

విజయ్ దేవరకొండపై సినిమా ప్రభావం

ఆ హీరోయిన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. నాకు చాలా స్పెషల్ అంటూ ఎమోషనల్ కామెంట్స్

నాగవంశీ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఫ్లాప్‌కు నిజంగా ఆ సీనే కారణమా, లేక మరేదైనా కారణమా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీని ప్రభావం విజయ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తీవ్రంగా పడిందని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.